Baldness : బట్టతలతో బాధపడుతున్నారా? అయితే ఈ ఒక్క టాబ్లెట్‌తో మీ సమస్యకు చెక్..!

Baldness : ప్రస్తుత కాలంలో ఆహార పద్దతుల్లో మార్పులు, వాతావరణ కాలుష్యం పెరగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ రోజుల్లో ఈ కారణాల వల్ల అందరినీ ఎక్కువగా వేధిస్తున్న సమస్యలలో జుట్టు రాలే సమస్య కూడా ప్రధానమైనది గా భావించవచ్చు. సాధారణంగా వయసు పైబడిన తరువాత జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. కానీ ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అతి చిన్న వయసులో కూడా జుట్టు రాలే సమస్య కారణంగా బట్టతల ఏర్పడుతుంది. ఈ సమస్య నుండి విముక్తి పొందటానికి చాలామంది హెయిర్ ప్లాంటేషన్ పద్దతి ద్వారా మళ్లీ జుట్టును తెచ్చుకుంటున్నారు. ఈ హెయిర్ ప్లాంటేషన్ పద్దతి కొంచం రిస్క్ తో కూడుకున్న పని.

are-you-suffering-from-baldness-but-put-check-your-problem-with-this-tablet
are-you-suffering-from-baldness-but-put-check-your-problem-with-this-tablet

అయితే ఇలా బట్టతలతో బాధపడుతున్న వారికి అమెరికాకు చెందిన కాన్సర్ట్ ఫార్మాసూటికల్స్ అనే డ్రగ్ కంపెనీ ప్రయోగాలు నిర్వహించిన ఒక టాబ్లెట్ తయారు చేశారు. దీంతో ఇది బట్టతల సమస్యతో బాధపడుతున్న వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సీటీపీ-543 అని టాబ్లెట్ తో బాధపడే వారు రోజుకు రెండు చొప్పున వేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా తల మీద వెంట్రుకలు కూడా వచ్చే అవకాశం ఉంది. పదిమంది మీద ఈ ప్రయోగం చేయగా నలుగురిలో 80 శాతం కంటే ఎక్కువ జుట్టు మొలిచింది.

కాన్సర్ట్ ఫార్మాస్యూటికల్ అనే డ్రగ్ కంపెనీ అమెరికాలోని 706 మంది మీద ఈ ప్రయోగం చేసింది. మూడు గ్రూపులుగా విభజించి వారిలో ఒక గ్రూప్ సభ్యులకు 8 ఎం.జి టాబ్లెట్స్ రోజుకు రెండు చొప్పున ఇవ్వగా, మరికొంతమందికి 12 ఎం జి టాబ్లెట్ రోజుకు రెండు చొప్పున ఇచ్చారు. ఇలా టాబ్లెట్స్ వాడిన వారిలో దాదాపు 20 శాతం కంటే ఎక్కువ రెట్లు జుట్టు పెరిగింది. అయితే కొంత మందిలో మాత్రం ఈ టాబ్లెట్స్ ఉపయోగించడం వల్ల వాంతులు తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ప్రయోగం ప్రస్తుతం చివరి దశలో ఉంది. బట్టతలతో బాధపడుతున్న వారికి ఈ టాబ్లెట్ అత్యుత్తమ చికిత్సగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. బట్టతలతో బాధపడుతున్న వారికి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు.

Advertisement

Read Also :  Amla seeds : ఉసిరికాయ తిన్న తర్వాత గింజలను పడేస్తున్నారా.. ఈ లాభాలు తెలుసుకుంటే ఇంకోసారి అలా చేయరు

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel