Guppedantha Manasu May 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి తన ప్రేమ విషయం వసుకి చెప్పడంతో వసు నో అని చెబుతోంది.
ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి తిరిగి వచ్చింది కాబట్టి నాపై ప్రేమ పుట్టింది రాకపోయి ఉంటే అది ప్రేమ అని తెలిసేది కాదు కదా సార్ అనడంతో ఆ మాటకు రిషి కోప్పడతాడు. మీకు తనకు ఎంగేజ్మెంట్ అయ్యింది. ఇప్పుడు సాక్షి మళ్లీ వచ్చింది. తనను వద్దు అనాలి అంటే ఒకరిని అవును అనాలి కదా సార్ ఆ ఒకరిని నేనే అయ్యాను కదా సార్ అని అనడంతో షట్ అప్ వసుధార అని గట్టిగా అరుస్తాడు.

అసలు నువ్వు ఏమి మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా. సాక్షి కి నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది అని చెప్పి నేను తప్పు చేశానా అంటూ నిలదీస్తాడు రిషి. నిన్ను నేను ప్రేమించడం తప్పు అంటావా వసు అని అడగగా అసలు మీది ప్రేమే కాదు అని అంటుంది వసు.
అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్ ఐ లవ్ యు చెప్పగానే ఒప్పుకుంటాను అనుకుంటున్నారా అని వసు అడగగా నాకేమి తక్కువ వసుధార అని రిషి అడగడం తో క్లారిటీ అని సమాధానం ఇస్తుంది వసుధార. మీరు సాక్షి మీద గెలవడానికి నిన్ను ప్రేమిస్తున్నారు అని రిషి ప్రేమను తప్పులు పడుతూ నానారకాలుగా అనడంతో ఆ మాటలకు ఋషి ఎమోషనల్ అవుతాడు.
అప్పుడు వసు ని పట్టుకొని నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అని అంటాడు. అప్పుడు వసు నేను మిమ్మల్ని ప్రేమించలేను సార్ అంటూ ముఖం మీదే చెప్పేస్తుంది. ఇంతలోనే వర్షం పడుతుంది. నేను మీకు ఒక వస్తువుల కనిపిస్తున్నానా సార్ మీరు ప్రేమిస్తున్నారు అనగా నేను కూడా మిమ్మల్ని ప్రేమించాలా అంటూ గట్టిగా నిలదీస్తుంది వసు.
ఆ తర్వాత రిషి ఇచ్చిన గిఫ్ట్ రిటర్న్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అప్పుడు రిషి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. మరొకవైపు సాక్షి, రిషిని వదిలేసి దూరంగా వెళ్ళిపో అంటూ వసు కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu May 27 Today Episode : రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు.. కోపంతో రగిలి పోతున్న రిషి..?
- Guppedantha Manasu july 14 Today Episode : వసుధార దెబ్బకు భయంతో వణికిపోతున్న సాక్షి.. దేవయానికి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన జగతి..?
- Guppedantha Manasu serial Oct 22 Today Episode : అసలు విషయం తెలుసుకుని షాక్ అయిన రిషి.. బాధలో వసుధార?
- Guppedantha Manasu serial Oct 15 Today Episode : వసు చేసిన పనికి కోపంతో రగిలిపోతున్న జగతి.. బాధలో రిషి?













