Devatha May 26 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవుడమ్మ మాటలు నిజం అని నమ్మిన ఆదిత్య చిన్మయి తన కూతురు అని అనుకుంటూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో దేవుడమ్మ తన మనసు బాగోలేదు అని ఆదిత్య, సత్య లతో చెప్పగా అప్పుడు ఆదిత్య ఎందుకు అమ్మ అని అడగగా.. నిన్న దేవి అన్న మాటలే నాకు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. ఆ పసి మనసులో ఎంతో బాధను మోస్తోంది అని బాధపడుతూ ఉంటుంది.
అంతేకాకుండా ఆ మాధవ కు అసలు బుద్ధి లేదు పిల్లలు దగ్గర ఎటువంటి మాట్లాడే మాట్లాడాలో తెలియదు అని మాధవా పై మండిపడుతుంది దేవుడమ్మ. కానీ ఈ సారి దేవి వాళ్ళ అమ్మ రాధ తో డైరెక్ట్ గా మాట్లాడుతాను అని అనగా అప్పుడు సత్య ఆదిత్య లు టెన్షన్ పడుతూ ఆ ఇంటి పెద్ద రామ్మూర్తి తో మాట్లాడండి అని సలహా ఇస్తారు.
అప్పుడు సరే అని చెప్పి దేవుడమ్మ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరొకవైపు జానకి రాధా ఇద్దరు పని చేసుకుంటూ ఉండగా ఇంతలో ముత్తయిదువులు శ్రీమంతానికి పిలిచి అనంతరం కొడుకు కోడలు పిల్లలతో మీరు ఎంతో సంతోషంగా ఉన్నారు అంటూ రాధా మాధవ భార్య భర్తలు అనుకోని మాట్లాడతారు.
ఇంతలో జానకీ అక్కడినుంచి వెళ్లిపోగా అప్పుడు మాధవ వెళ్లి పిల్లలకు లేనిపోని మాటలు అన్నీ చెప్పి పిల్లల మనసును చెడగొడతాడు. అప్పుడు రాధా ఇలాగే ఉంటే మాధవా సారు రోజురోజుకీ మితిమీరి పోతున్నాడు ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది.
ఆ తర్వాత రాధా జానకి చెప్పి బయటకు వెళ్తూ ఉండగా ఇంతలో మాధవా అడ్డుపడి రాధకు కోపం వచ్చే విధంగా మాట్లాడతాడు. బయటకు వెళ్లిన రాధా నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఇంతలో ఆదిత్య ఎదురు పడతాడు. అప్పుడు ఆదిత్య వచ్చి మీ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది నువ్వు, దేవి ఆనందంగా ఉంటారు అనే కదా నేను ఇద్దరికీ దూరంగా ఉంటున్నాను కానీ మీ పరిస్థితులను బట్టి చూస్తే మీరు ఇంట్లో ఆనందంగా లేరు అని అనిపిస్తుంది అని అంటాడు ఆదిత్య.
కానీ రాధ మాత్రం ఏమీ లేదు అంటూ అబద్ధం చెప్పగా ఆదిత్య సీరియస్ అవుతాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా చాటుగా మాధవ మాటలు అన్నీ వింటూ ఉంటాడు. ఆ తర్వాత రాధా అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా మధ్యలో మాధవా వచ్చి కారులో కూర్చో అని చెబుతాడు. కానీ రాధ మాత్రం కార్లో కూర్చోడానికి నిరాకరిస్తుంది.
ఇక రేపటి ఎపిసోడ్ సత్య దేవుడమ్మ ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్లి పిల్లల గురించి అడగగా సత్య కు జీవితంలో పిల్లలు కలరు పిల్లలు కలిగే భాగ్యం లేదు అని డాక్టర్లు చెప్పడంతో సత్య ఎమోషనల్ అవుతుంది. ఆ మాట విన్న దేవుడమ్మ షాక్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Devatha MAY 25 Today Episode : చిన్మయి తన కూతురు అనుకుంటున్న ఆదిత్య.. బాధతో కుమిలిపోతున్న రాధ..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World