Job notification: నిరుద్యోగులకు మరో శుభవార్త.. డీఎస్పీతో పాటు పలు పోస్టులతో అర్హతల మార్పు

Job notification : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ సారి డీఎస్పీకి ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఈ వార్త. ఇటీవల 503 గ్రూప్-1 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ పోస్టులకు దరఖాస్తుల ప్రాసెస్ నడుస్తోంది. ఈ నెల 31 వరకు గడువు ఉంది. ఇందులో డీఎస్పీ పోస్టులు 91 ఉన్నాయి. ఇటీవల యూనిఫాం పోస్టులకు ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల వయో పరిమితిని మరో రెండేళ్లు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. దాంతో పాటు డీఎస్పీ ఉద్యోగాలకూ వయో పరిమితిని పెంచింది. ఎత్తుకు సంబంధించిన అంశంలోనూ పలు మార్పులు చేసింది.

Job notification
Job notification

డీఎస్పీ ఉద్యోగాలకు ఇప్పటి వరకు 31 ఏళ్లు వయో పరిమితి ఉండగా.. ఇప్పుడు దానిని 33 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులకు ఈ వయో పరిమితి సడలింపు వర్తిస్తుంది. అలాగే 167.6 సెంటీమీటర్లు ఎత్తు అర్హత ఉండేది. దానిని కూడా తగ్గించింది. 165 సెంటీమీటర్లు ఉన్న వారు కూడా డీఎస్పీ ఉద్యోగాలకు అర్హులేనని ప్రభుత్వం వెల్లడించింది.

మహిళలకు గతంలో 152.5 సెంటీమీటర్లు ఉండగా.. ప్రస్తుతం దాన్ని 150 సెంటీమీటర్లకు తగ్గించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో కూడా ఐపీఎస్ అభ్యర్థు ఎత్తు 165 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తెలంగాణ కూడా అదే హైట్ ను అర్హతగా నిర్ణయించింది.
Read Also : TS Police Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. పోలీస్ నియామకాలకు రెండేళ్లు వయోపరిమితి పెంచిన తెలంగాణ సర్కార్!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel