...

Big Boss Ott Non Stop Telugu : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో సందడి చేసిన అతిథులు వీళ్లే?

Big Boss Ott Non Stop Telugu : బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం మరొక రోజుతో ముగియనుంది ఆదివారం ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఎంతో ఘనంగా జరుపుకోనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో బాబా భాస్కర్‌, అరియానా, అనిల్‌, మిత్ర శర్మ, అఖిల్‌, బిందు మాధవి, యాంకర్‌ శివ ఉన్నారు. ఇలా గ్రాండ్ ఫినాలేకి ఏడు మంది కంటెస్టెంట్ లో ఉండడం ఇదే మొదటిసారి. ఇక నేడు సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ ఫినాలే ఎంతో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నారు.

Big Boss Ott Non Stop Telugu
Big Boss Ott Non Stop Telugu

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరు వస్తారని ఇన్ని రోజులు పెద్దఎత్తున చర్చలు జరిగాయి. అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో భాగంగా ఎఫ్3, మేజర్ చిత్రబృందం సందడి చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక సూట్కేస్ చేతపట్టుకుని లోపలికి వెళ్లి బిగ్ బాస్ ఆఫర్ ను కంటెస్టెంట్ తీసుకునేలా బిగ్ బాస్ అవకాశం కల్పించారు. అయితే ఇలా గ్రాండ్ ఫినాలేలో పాల్గొన్న వాళ్లు ఎవరు కూడా ఇలా డబ్బులు తీసుకుని బయటకు రాలేదు. కానీ సోహైల్ మాత్రం 25 లక్షలు చేతబట్టుకొని బయటకు వచ్చారు.

ఇక ఈ కార్యక్రమంలో కూడా అరియానా 10 లక్షల రూపాయల సూట్కేస్ తీసుకొని తానే కార్యక్రమం నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.ఈ విధంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు కూడా బిగ్ బాస్ వేదికపైకి వచ్చి పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే నాన్ స్టాప్ కార్యక్రమంలో బిందుమాధవి గెలిచారని, అఖిల్ రన్నర్ గా మిగిలారనీ వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే కేవలం కొన్ని గంటలు వేచి ఉండాలి.
Read Also : Big boss winner : బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ బింధుమాదవి.. అఖిల్ స్థానమేంటి?