Corona news: కరోనా మళ్లీ విజృంభించొచ్చు.. జాగ్రత్తలు చెప్పిన సర్కారు!

Updated on: May 20, 2022

Corona news : తెలంగాణలో కరోనా మళ్లీ పెరగవచ్చని, కేసులు పెరిగే ఛాన్స్ ఉందని సర్కారు అప్రమత్తం చేసింది. మహమ్మారి మరో సారి విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పాత జన్యురూపాన్ని మార్చుకుని వచ్చిన కొత్త రకం వైరస్ కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతోంది. ప్రస్తుతం ఈ కరోనా వేరియంటే.. దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో ఎక్కువగా నమోదు అవుతోందని అధికారులు చెబుతున్నారు.

Corona news
Corona news

మన దగ్గర ఈ కొత్త రకం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు టెస్టింగ్ కిట్లను సప్లై చేసినట్లు వెల్లడించారు. కరోనా వ్యాప్తి తీవ్రతను బట్టి కట్టడి చర్యలను వేగవంతం చేస్తామని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు తెలిపారు. అన్ని జిల్లాల వైద్యాధికారులకు కూడా బీఏ 4 పట్ల అలర్ట్ ఇచ్చినట్లు వెల్లడించారు.

దక్షిణ ఆఫ్రికా, యూకే దేశాల నుండి వచ్చినోళ్లను అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరముందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ లేనందున కార్వంటైన్, నెగెటివ్ ఎంట్రీలపై ఎలాంటి నిర్మయం తీసుకోలేమని అధికారులు స్పష్టం చేశారు. అయితే బీఏ4 వేరియంట్ ఇంతకుముందు వచ్చినోళ్లకు, వ్యాక్సిన్ తీసుకున్న వారిపై కూడా దాడి చేసే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ వో స్పష్టం చేయడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రమాదకరమైన పరిస్థితులు మాత్రం తలెత్తే ఛాన్స్ లేదని వెల్లడించారు తెలంగాణ ప్రజా రోగ్య సంచాలకులు శ్రీనివాస రావు.

Advertisement

Read Also :Corona Virus: భారత్ లో కొత్తగా 3324 నమోదైన పాజిటివ్ కేసులు..40 మంది మృతి.. హెచ్చరికలు జారీ చేస్తున్న నిపుణులు!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel