Interesting news: భారత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు ఐఐటీలు. అలాంటి ఐఐటీల్లో చదువుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అందుకు సంవత్సరాల తరబడి శ్రమిస్తారు కూడా. కానీ అతి కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. ఐఐటీలో చదువుకోవడమే ప్రతిష్టాత్మకం అనుకుంటే అందులో టాపర్స్ గా నిలవడం అంటే మాటలు కాదు. అలాంటిది ఆ దంపతులిద్దరూ ఐఐటీ టాపర్స్. ఎందరో కలలు కనేలా విదేశాల్లో మంచి ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు.
అమెరికాలో కోట్లాది రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం పొందారు ఆ దంపతులు అర్పిత్, మహేశ్వరి. మంచి జీతం అందుకుమించి మంచి జీవితం కానీ వాటిని అన్నింటినీ వదులుకున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరుకి తిరిగొచ్చారు. ప్రస్తుతం అంతా వారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆ దంపతులు రాజస్థాన్ రాష్ట్ర జోధ్ పూర్ ఉజ్జయినిలోని బద్ నగర్ చెందిన వారు. ఆధునికీకరణ పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నారని భావించి అది మార్చులనుకున్నారు.
తమ వంతుగైగా ఏదైనా మార్పు తేవాలనుకున్నారు. అమెరికాలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్ కు వచ్చారు. ఉజ్జయినిలోని ఒకటిన్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసి పార్మా కల్చర్ వ్యవసాయం చేయడం ప్రారంభించారు. వీరి నిర్ణయంపై మొదట స్థానికులంతా హేళనగా మాట్లాడేవారు. అయితే అర్పిత్ దంపతులు మాత్రం అవేవీ పట్టించుకోకుండా తమ పని తాము చేయడం ప్రారంభించారు.
ఎకరంన్నర భూమిలో 75 రకాల మొక్కలు నాటారు. భూమిని సారవంతం చేసేందుకు కరంజ్ అనే రకం మొక్కలను నాటారు. పర్మా కల్చర్ అనే నూతన విధానం ఆస్ట్రేలియా నుండి ప్రపంచమంతటా వ్యాపించిందని చెప్పాడు. ప్రస్తుతం తమ ఆగ్రో టూరిజం చూసేందుకు ఢిల్లీ, ముంబై, గోవా, మణిపూర్ సహా విదేశాల నుండి వస్తున్నారు. ప్రస్తుతం ఖర్చుల కోసం రోజూ 3 గంటల పాటు ఆన్ లైన్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ మిగతా సమయాన్ని వ్యవసాయానికి కేటాయిస్తున్నారు.