Karthika Deepam: దగ్గరైన జ్వాలా, సౌందర్య.. సత్య ను అవమానించిన స్వప్న..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య ద్వారా పై కోపంతో మీ నాన్న ఎవరు ఒక ఆడపిల్ల ఆటో నడుపుతుంటే అతని ఏం చేస్తున్నాడు అంటూ ఫైర్ అవుతుంది.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య, జ్వాలా తో మాట్లాడుతూ నువ్వు ఇంత చిన్న వయసులో ఇలా ఎలా మాట్లాడుతున్నావు అంటూ జ్వాలాని పొగుడుతుంది. ఆ తర్వాత వారిద్దరూ కాసేపు కష్టసుఖాల గురించి మాట్లాడుకున్న తరువాత మీ నాన్న ఎవరూ ఇన్ని తెలివితేటలు ఉన్న నిన్ను చదివించకుండా ఆటో నడపమని తేడా వెధవ అని తిట్టగా ఆ మాటలకు సౌర్య ఎమోషనల్ అవుతుంది.

Advertisement

Advertisement

అప్పుడు జ్వాలా మా అమ్మానాన్నలను ఆ దేవుడు తీసుకెళ్లాడు అని చెప్పడంతో సౌందర్య సారీ చెబుతోంది. మరొకవైపు హిమ,నిరుపమ్ ఇద్దరూ కలిసి కారులో బయటకు వెళుతూ ఉంటారు. అయితే నిరుపమ్ జరిగిన విషయం గురించి తలుచుకుని బాధ పడుతూ ఉండగా, బాబా ఏదో ఒకటి మాట్లాడు నీ మౌనం నేను భరించలేక పోతున్నాను.

Advertisement

నీ కోపం తగ్గే వరకు నన్ను తిట్టు బావ అని అడుగుతుంది. కోపం పోతుందేమో కానీ ప్రేమ పోదు కదా హిమ అని అంటాడు నిరుపమ్. మరొకవైపు స్వప్న,సత్య ఇంటికి వెళ్తుంది. స్వప్న ని చూసిన సత్య ఆనందంతో లోపలికి రమ్మని పిలుస్తాడు. అప్పుడు నీ మర్యాదల కోసం ఏమి రాలేదు అని స్వప్న కోపంగా మాట్లాడుతుంది.

Advertisement

అలాగే నీ కొడుకుని కాపాడుకోండి వాడు మళ్ళీ ప్రేమ ప్రేమ అంటూ దేవదాసులా తిరుగుతున్నాడు భర్తగా ఎలాగో ఫెయిల్ అయ్యారు కనీసం నాన్నలా అయిన మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సౌందర్య ఇంట్లో ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సౌర్య,సౌందర్య కు ఫోన్ చేసి నేను నానమ్మ సౌర్య ని అని అంటుంది. ఆ మాటకు సౌందర్య ఆనంద పడుతూ ఉంటుంది.

Advertisement

అదే విషయాన్ని హిమ దగ్గరికి వెళ్లి చెప్పగా హిమ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన స్వప్న మొదటగా దాన్ని వెదికే పనిలో ఉండండి. కానీ అది దొరికితే దాన్ని తీసుకొచ్చి నా కొడుకుకి అంట పెట్టాలని చూడకండి అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement
Advertisement