Horoscope: ఈ వారం అంటే మే 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ రెండు రాశుల వారికి ఉద్యోగంలో మంచి గుర్తింపు రాబోతుంది. వారు ఏ పని చేసినా అది వారికి లాభదాయకంగా నిలవబోతోంది. అంతే కాదండోయ్ అవార్డులు, రివార్డులతో పాటు పై అధికారాలు ప్రశంసలను అందుకుంటారు. అయితే ఈ రెండు రాశులు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా సింహ రాశి.. ఈ రాశి వారికి ఈ వారం అంతా ఉద్యోగంలో అంతా మంచే జరుగుతుంది. పై అధికారుల నుంచి ప్రశంసలుంటాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కాకపోతే వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏకాగ్రతతో పని చేస్తేనే లాభాలు ఉంటాయి. లేదంటే చాలా నష్టపోయే అవకాశం ఉంది.
రెండోది కన్యా రాశి… ఈ రాశి వారికి ఉద్యోగంలో మంచి గుర్తింపు రాబోతుంది. వీరు ఏ పని చేసినా అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్లు, అవార్డులు, రివార్డులు కూడా అందుకునే ఆవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి పని చేసే టప్పుడు చాలా జాగ్రత్త అవసరం.