Devatha: మాధవ పై కోప్పడిన రాధ.. భాగ్యమ్మ తో కలిసి ఆటలు ఆడుకుంటున్న దేవి..?

Updated on: May 19, 2022

Devatha:తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ పిల్లలతో పాటు తోట కి వెళ్ళిన బాగుండేది నాకు ఈ లొల్లి తప్పి ఉండేది అని బాధపడుతూ ఉంటుంది.

ఇక ఈ రోజు ఎపిసోడ్ లో దేవి, చిన్మయి ఇద్దరూ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోగా ఆ సమయంలో వారిద్దరి మెడలో ఉన్న చైన్ లు తగులుకుంటాయి. అప్పుడు చిన్మయి వాటిని కీర్తి ఉండగా దేవి మాత్రం ఆలోచనలో పడుతుంది.

Advertisement

మరొకవైపు జానకి, రాధ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా రాధ లో ఎందుకు ఇలాంటి మార్పు వచ్చింది అసలు రాధకు ఏమయ్యింది అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు ఆదిత్య కూడా రాధ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రాధా ప్రవర్తనా తీరును బట్టి చూస్తే ఇంట్లో సంతోషంగా ఉండడం లేదు అక్కడ తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అనుకుంటాడు ఆదిత్య.

రాధ ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఫోన్ మాట్లాడుతూ మాధవ వస్తాడు. తన స్థలాన్ని వేరేవాళ్లు లాక్కోవడం తో స్థలం విషయంలో ఫైర్ అవుతాడు. ఆ తర్వాత మాధవ అక్కడి నుంచి వెళ్తుండగా రాద ఆగమని చెప్పి మీ స్థలం వేరే వాళ్ళు లాక్ ఉంటేనే మీరు అంత లా ఫీల్ అవుతున్నారు.

మరి వేరే వాళ్ళ భార్యను మీరు ఎలా సొంతం చేసుకుంటారు అని గట్టిగా అడుగుతుంది రాధ. ఇంతలో దేవి ఏదో ఆలోచించుకుంటూ అక్కడికి వస్తుంది. అప్పుడు దేవుని చూసిన రాధా మౌనంగా అక్కడి నుంచి దేవిని బయటకు తీసుకుని వెళుతుంది. మరొక వైపు భాగ్యమ్మ రాధ,దేవి ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

Advertisement

దేవి అక్కడికి రావడంతో దేవిని చూసి మనసులో ఇంతకాలం నా మనవరాలు నువ్వే అని తెలియక ఉన్నాను అంటూ ఆనందం వ్యక్తం చేసుకుంటుంది. ఆ తర్వాత భాగ్యమ్మ తో కలసి దేవి కొద్దిసేపు ఆడుకుంటుంది. దేవి ఆడుకోవడం చూసిన భాగ్యమ్మ మురిసిపోతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel