Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి, వెళ్ళి రామ కోసం కన్న బాబుతో గొడవపడి వస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జానకి వెళ్లి కన్న బాబును కలిసిన విషయం మల్లిక వెళ్లి జ్ఞానాంబ కు చెబుతుంది. అప్పుడు జ్ఞానాంబ మల్లిక చెప్పేది నిజమేనా అని అనుకుంటుంది. అయితే అదే మంచి అవకాశం అనుకున్న మల్లిక జానకి పై లేని పోనీ మాటలు చెప్పి రెచ్చగొడుతుంది.
ఇంతలోనే జానకి ఇంటికి రావడంతో అప్పుడు జ్ఞానాంబ,మల్లిక చెప్పేది నిజమేనా అంటూ నిలదీస్తూ ఉండగా అప్పుడు జానకి ఒక ఫోటో తీసుకుని వచ్చి ఆ ఫ్రేమ్ ఆర్డర్ ఇచ్చాను అందుకోసం వెళ్లాను అని చెబుతుంది. ఆ ఫోటో చూడగానే జ్ఞానాంబ కుటుంబం అందరూ హ్యాపీగా ఫీలవుతారు.
కానీ మల్లిక మాత్రం కుళ్ళు కుంటూ ఉంటుంది. ఇప్పుడు జ్ఞానాంబ మల్లిక పై అరుస్తూ ఈ సారి ఇలా అబద్ధాలు చెబితే మర్యాదగా ఉండదు అని కోప్పడుతుంది.ఆ తరువాత రూమ్ లోకి వెళ్ళి మీరు గొడవ పడ్డారు అన్న కారణంతో ఆ కన్నబాబు మరి ఇంటికి వచ్చి గొడవ చేస్తే పరిస్థితి ఏమిటి అని రామ చంద్ర జానకి ని అడుగుతాడు.
ఇక జానకి అతనికి వచ్చే ధైర్యం లేదని అంటుంది. ఇక జానకి సమస్య గురించి భయపడొద్దు అంటూ రామా కు దైర్యం చెబుతుంది. మరొక వైపు మల్లిక తన బర్త తో రామచంద్ర జానకి ల గురించి చెబుతూ అత్తయ్య గారికి తెలియకుండా ఏదో లోపల గూడుపుఠాని అడుగుతున్నారు అని అంటుంది.
ఆ తరువాత మల్లిక ఊరికి వెళ్ళిపోయింది అని ఆమె భర్త ఆనందంతో డాన్సులు వేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి పనిమనిషి అతని తమ్ముడు ఇద్దరు వచ్చి అతనితో కలిసి డ్యాన్సులు వేశారు. ఆ తర్వాత జానకి రామచంద్ర లు ఎప్పటిలాగే కలిసి బయటకు వెళ్తారు. దారి మధ్యలో జానకి నేషనల్ చేఫ్ కాంపిటీషన్స్ యాడ్ చూసి అందులో ఎలాగైనా పాల్గొనాలి అని మనసులో అనుకుంటుంది.
అంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు అని అనుకుంటుంది. అదే విషయం గురించి రామచంద్రకు కూడా వివరిస్తుంది. కానీ జ్ఞానాంబ మాత్రం అందుకు నిరాకరిస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి…
Tufan9 Telugu News And Updates Breaking News All over World