Viral Video: పెళ్ళిలో ఫోటో దిగటం కోసం రాళ్ళు, కర్రలతో కొట్టుకున్న బంధువులు.. వీడియో వైరల్!

Viral Video: సాధారణంగా పెళ్ళి అంటే బంధుమిత్రులతో ఇల్లంతా ఎంతో సందడిగా ఉంటుంది. పెళ్లి మండపంలో వధువు వరుడు తరపు బంధువుల మధ్య ఎంతో ఆనందంగా జరుపుకునే వేడుకే పెళ్లి. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న కారణాల వల్ల పెళ్లి వేడుకల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. కట్నకానుకలు, మర్యాదల విషయంలో తరచూ గొడవలు జరగడం మనం చూసే ఉంటాం. కానీ ఇటీవల జార్ఖండ్ లో జరిగిన ఒక పెళ్లి వేడుకలో ఒక వింత కారణంచేత పెళ్లికి వచ్చిన బంధువులు ఒకరిమీద ఒకరు దాడి చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే..గిరిదిహ్‌లోని ధన్వర్ బ్లాక్‌కు చెందిన యువకునికి, బీహార్‌లోని సరన్‌ ప్రాంతానికి చెందిన యువతికి గిరిదిహ్ జిల్లాలోని జమువా బ్లాక్‌ పరిధిలో మీర్జాగంజ్‌ లో ఉన్న మత్స్యకారుల సూర్యదేవాలయానికి సంబంధించిన మండపంలో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత పెళ్లికి వచ్చిన బంధువులు వధూవరులతో ఫోటోలు దిగుతున్నారు. అయితే పెళ్లికి వచ్చిన కొందరు వ్యక్తులు మాత్రం ఫోటో దిగడం కోసం పోటీపడి ఒకరినొకరు దూషించుకున్నారు. చిన్నగా మాటలతో మొదలైన ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి చివరకి రాళ్లు, కర్రలతో కొట్టుకొని స్థాయికి వెళ్ళింది.

Advertisement

అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న మండపంలో ఇలా హఠాత్తుగా ఒకరిమీద ఒకరు దాడి చేసుకోవటంతో అక్కడ ఉన్న చిన్న పిల్లలు వృద్ధులు భయంతో గట్టిగా కేకలు వేయడం ప్రారంభించారు. ఇది గమనించిన అక్కడి స్థానికులు విషయం తెలుసుకొని ఇరువర్గాల వారికి సర్దిచెప్పి మండపంలోకి పంపించారు. ఎంతో ప్రశాంతంగా సాగిపోవల్సిన ఈ పెళ్లిలో ఫోటోలు దిగడం కోసం ఇలా రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ జరుగుతున్న ఈ ఘటనని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Advertisement