Viral news: మాకు నేరుగా కొలువులివ్వొద్దు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి చాలు

Viral news: తెలంగాణలో ఉద్యోగాల జాతర నడుస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. గ్రూప్-1 కొలువులకు, కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే.. నిరుద్యోగుల నుండి మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. అదే వయో పరిమితిని పెంచడం.

గ్రూప్-1, గ్రూప్-2 సహా ఇతర ఉద్యోగాలకు వయో పరిమితిని పెంచింది తెలంగాణ ప్రభుత్వం. అయితే పోలీసు ఉద్యోగాలకు, ఇతర యూనిఫాం పోస్టులకు మాత్రం ఏజ్ ను పెంచలేదు. అయితే తమకూ వయో పరిమితిని పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కొన్ని రోజులుగా నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు.

we dont want job give us some opportunity

అయితే.. ఈ అంశంపై మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ స్పందించారు. నిరుద్యోగుల డిమాండ్ ను పరిశీలిస్తామని చెప్పారు. అయినా.. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఏజ్ లిమిట్ అయిపోయిన నిరుద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై ఇటీవల హైదరాబాద్ లక్డీకపూల్ లోని డీజీపీ ఆఫీస్ ను ముట్టడించిన విషయం తెలిసిందే. కానిస్టేబుల్ ఉద్యోగాలకు రెండేళ్ల వయో పరిమితి పెంచాలని, ఒక్క అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా… ఓ నిరుద్యోగి మీడియాతో మాట్లాడుతూ.. నోటిఫికేషన్ కోసం నాలుగేళ్లు ఎదురుచూశామని చెప్పారు.

తీరా నోటిఫికేషన్ విడుదల అయ్యాక ఏజ్ లిమిట్ అయిపోయిందని వాపోయారు. రెండేళ్ల వయో పరిమితి పెంచి ఒక్క అవకాశం ఇవ్వాలని, తాము నేరుగా ఉద్యోగం ఉవ్వాలని అడగటం లేదని, ఒక్క అవకాశం ఇవ్వండని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటూ మీడియా ముందు వేడుకుంటున్నారు.