Satyanarayana vratam: ఈనెలలో సత్యనారాయణ స్వామి వ్రతానికి మంచి ముహూర్తం ఎప్పుడు ఉన్నాయంటే..?

Satyanarayana vratam: సత్యనారాయణ స్వామి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పురాణాల్లోనూ ఈ వ్రతంపై ఎంతో ముఖ్యంగా ప్రస్తావించిన విషయం చాలా మందికి తెలిసిందే. సత్య నారాయణ స్వామి ఎంత పవర్ ఫుల్ లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం సమయంలో చెప్పే కథల ద్వారా తెలుస్తుంది. భక్తితో ఆరాధిస్తే ఆ స్వామి వారు ఎవరినైనా ఆదుకుంటారనేదానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కొత్తగా పెళ్లైన జంటలు చేస్తుంటారు. అలాగే కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసిన సందర్భాల్లోనూ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేస్తే జీవితంలో ఎలాంటి ఆటంకాలు కలగవని గట్టిగా నమ్ముతారు. పురాణాల ప్రకారం శ్రీ మహా సత్యనారాయణ స్వామి.. శ్రీ మహా విష్ణువు స్వరూపమే అని అంటారు.

Advertisement

2022 లో సత్య నారాయణ ఎప్పుడు చేయాలి శుభ ముహూర్తం ఎప్పుడు ఉంది. సత్య నారాయణ స్వామి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఆ విశేషాలను ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
2022 ఏడాదిలో మే నెలలో 15వ తేదీన అంటే ఆదివారం శుక్ల పూర్ణిమ రోజున సత్యనారాయణ పూజ చేయించుకుంటే చాలా మంచిది.
వైశాఖ శుక్ల పూర్ణమి తిథి ప్రారంభం ఎప్పుడు ఉంటే.. మే 15వ తేదీన మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రారంభం అవుతుంది. అలాగే మే 16 రాత్రి 9.43 గంటలకు పూర్ణిమ తిథి ముగుస్తుంది. అదే విధంగా ఇదే ఏడాదిలో ఇక్కడ పేర్కొన్న తేదీల్లో కూడా సత్యనారాయణ వ్రతం జరుపుకోవచ్చు.
జూన్ 14
జులై 13
ఆగస్టు 11
సెప్టెంబర్ 10
అక్టోబర్ 9
నవంబర్ 8
డిసెంబర్ 7 తేదీల్లో సత్య నారాయణ వ్రతం జరుపుకునేందుకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

Advertisement