Viral video: సూపర్ స్పీడ్ తో భవనంలోకి దూసుకెళ్లిన కారు..

Viral video: రోడ్డుపై ప్రయాణించే సమయంలో అత్యంత జాగురుకతతో మెలగాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలే పోతాయి. చిన్న పాటి ఏమరపాటు విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. వెంట్రుక మందం లాంటి నిర్లక్ష్యానికి కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. రోడ్డుపై వాహనంలో వెళ్తున్న సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే చాలా సందర్భాలు మనకు తెలిసే ఉంటాయి. ఎదుటి వారి నిర్లక్ష్యం కూడా మనపై ప్రభావం చూపిస్తాయి.

నాలుగు రోడ్లు కూడలి, బ్లైండ్ స్పాట్ ప్రాంతాల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో జరిగిన ఓ ఘటన చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అది సాధారణ రోడ్డు ప్రమాదం అయితే కాదు. ఎందుకంటే అందులో టెస్లా కారు ఉంది. టెస్లా కారు ఆటో డ్రైవింగ్ మోడ్ లో ప్రయాణిస్తుంది. అలాంటి కారు కూడా ప్రమాదానికి గురి కావడం చాలా మందిని అయోమయంలో పడేసింది.

Advertisement

ట్రాఫిక్ సిగ్నల్ ను దాటేందుకు.. అతి వేగంగా వచ్చిన ఓ టెస్లా కారు ఊహించని పరిణామాన్ని ఎదుర్కొంది. ఓహియోలోని కొలంబస్ లో ఒక కన్వెన్షన్ సెంటర్ వద్ద జరిగింది ఈ ప్రమాదం. అతి వేగంతో వస్తున్న టెస్లా.. ఈవీ కారు గ్రీన్ సిగ్నల్ దాటడం కోసం అతి వేగంతో వచ్చింది. ఈ క్రమంలో కారు కంట్రోల్ కాకపోవడంతో ఎదురుగా ఉన్న కన్వెన్షన్ సెంటర్ లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో టెస్లా కారు 112 కిమీ వేగంలో ఉంది.

Advertisement

Advertisement