Woman get married thirty men: ఇటీవల పెళ్లిళ్ల పేరుతో మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ మధ్య ఎక్కువగా అమ్మాయిలు దొరక్కపోవడంతో ఇలాంటి మోసాలు చేసేందుకు సులువుగా మారింది. అయితే బాగా డబ్బున్న వారిని చూసి పెళ్లి చేసుకోవడం… ఆ తర్వాత అత్తింటి నుంచి డబ్బు, నగలతో పారిపోవడం పరిపాటిగా మారింది. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. తాజాగా ఇలా పెళ్లిళ్ల పేరుతో యువకులను మోసం చేసే ఈ ముఠాను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజస్థాన్ లోని గరిజనుల ప్రాబల్య జిల్లా దుంగార్ పూర్ జిల్లా సగ్వారా పోలీసులు.. ఇప్పటి వరకు 30 మందిని వివాహం చేుకొని మోసాలకు పాల్పడుతున్న వధువును అరెస్ట్ చేశారు. మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ లో దొంగ పెళ్లి కూతురు రీనాను అందుపులోకి తీసుకున్నారు. ఈమె పెళ్లి పేరుతో ఒకర్ని మోసం చేసి 5 లక్షల రూపాయలతో ఏడాది క్రితం పారిపోయింది. ఈ కేసులు సంబంధించిన ఆమెను అరెస్ట్ చేశారు. విచారణలో సంచలను విషయాలు తెలిశాయి. ఇప్పటి వరకు 30 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది. ఆమె అసలు పేరు సీతా చౌదరి. కానీ నకిలీ ఆధార్ కార్డులు, పత్రాలతో… పెళ్లి చేసుకున్న ప్రతీసారి పేరు మార్చుకుంటుంది. చాలా కాలంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారిని ఎంచుకొని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత రెండు మూడు రోజులు ఉండి… డబ్బు, నగలతో అత్తింటి నుంచి ఉడాయిస్తుంది.