Guppedantha Manasu: జగతి, మహేంద్రలకు పార్టీ ఇస్తానన్న రిషి.. ఆలోచనలో వసు..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో గౌతమ్ వసు కి ప్రపోజ్ చేస్తాడు.

Advertisement

ఇక ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్ నిన్ను కలిసిన మొదటి రోజు నుంచే ఈ విషయం నీకు చెప్పాలి అని అనుకుంటున్నాను కానీ ఈ రోజు ధైర్యం చేసి చెప్పేసాను అని అనడంతో, అప్పుడు వసు, గౌతమ్ సార్ మీ ప్లేస్ లో మీరు కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే చెప్పు చెంప ఛెళ్లుమనిపించే దాన్ని కాకపోతే మీరు రిషి సార్ ఫ్రెండు అని నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను అని అంటుంది.

Advertisement

Advertisement

ఆ మాటకు గౌతం ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంతేకాకుండా మీరు నాకు ఐ లవ్ యు చెబితే నేను మీకు ఓకే చెబుతా అని ఎలా అనుకుంటారు అని అనగా ఆ మాటల విని గౌతమ్ షాక్ అవుతాడు. ఇక ఆ మాటలు అన్నీ చాటుగా వింటున్న రిషి నీ మనసులో ఎవరున్నారో తెలుసుకోవడమే నాగోల్ అని అనుకుంటూ వెళ్ళిపోతాడు.

Advertisement

ఆ తర్వాత గౌతమ్, వసు కోసం తీసుకుని వచ్చిన ఆ బొమ్మను ఓపెన్ చేసి చూడమని చెప్పగా ఆ పెయింటింగ్ ని చూసి వసు తెగ ఆనందపడుతుంది. అప్పుడు గౌతం వెళ్ళిపోతూ ఈ బొమ్మను ఎవరు గీశారో నువ్వే కనుక్కో అని చెప్పి వసు కి చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి దగ్గరికి వెళ్లిన గౌతమ్ వసు ప్రపోజల్ రిజెక్ట్ చేసినందుకు బాధపడుతూ ఉంటాడు.

Advertisement

అప్పుడు రిషి, గౌతమ్ నిఓదారుస్తాడు. మరోవైపు వసు ఆ బొమ్మ గీసిన వారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ కళకి హ్యాట్సాఫ్ అని పొగుడుతుంది. ఇక ఇంత గొప్పగా బొమ్మ గీసిన ఆ వ్యక్తి గురించి నేను ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటుంది.

Advertisement

అంతేకాకుండా వసు గతంలో తనకు లవ్ లెటర్ రాసిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఆ లెటర్ లో మేటర్ గురించి గొప్పగా అనుకుంటుంది. మరో వైపు రిషి మహేంద్ర దంపతులతో నేను ఒక పార్టీ ఇవ్వబోతున్నాను. ఆ పార్టీకి చీఫ్ గెస్ట్ గౌతమ్ అని అంటాడు. ఆ తర్వాత రిషి వసు పని చేసే రెస్టారెంట్ కి వెళతాడు.

Advertisement

ఇక రెస్టారెంట్లో రిషి,వసుతో మాట్లాడుతూండగా సాక్షి వాళ్ళిద్దర్నీ చూసి రిషి ఏంటి చీప్ గా దీంతో తిరుగుతున్నాడు అని అనుకుంటుంది. ఇక సాక్షి అక్కడికి వెళ్లగా రిషి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత కొంత సేపు వసు, సాక్షి ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement
Advertisement