Viral Video: కొత్త జంటకు వెరైటీ కానుకలు ఇచ్చిన స్నేహితులు.. వైరల్ అవుతున్న వీడియో!

Viral Video: పెళ్లి అనగానే ఆ వాతావరణం మొత్తం ఎంతో ఆహ్లాదకరంగా మారిపోతుంది. బంధువులు, స్నేహితులు, బాజాభజంత్రీలు, విందు భోజనాలు ఇలా చెప్పుకుంటూ పోతే పెళ్లిలో ఎన్నో సరదా సన్నివేశాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో పెళ్లికి సంబంధించిన ఎన్నో వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా పెళ్లికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.సాధారణంగా పెళ్లికి వచ్చే అతిథులు వారి స్థాయికి తగ్గట్టుగా బహుమతులు అందజేస్తూ ఉంటారు.ముఖ్యంగా స్నేహితులు వస్తే కనుక స్నేహితులు అందరూ కలిసి ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వడం మనం చూస్తుంటాము. కానీ ఈ పెళ్లిలో మాత్రం స్నేహితులు వరుడికి వెరైటీ కానుకలిచ్చి అందర్నీ నవ్వించారు.

Advertisement

మరి ఈ కానుకలు ఏమిటి అనే విషయానికి వస్తే..వధూవరులు రిసెప్షన్ సమయంలో వేదికపై నిలబడి ఉండగా వరుడు బంధువులు ఒక్కొక్కరుగా అతనికి గిఫ్ట్ ఇస్తూ వెళ్లారు. ఈ క్రమంలోనే ఒక స్నేహితుడు బకెట్ గిఫ్ట్ ఇవ్వగా మరొకరు చీపురు, మరొకరు చేట, మరొకరు మగ్గు ఇలా ఫన్నీ వస్తువులను బహుమతులుగా అందజేశారు. ఈ క్రమంలోనే వరుడు స్నేహితులు ఇచ్చిన కానుకలు చూసి వధూవరులు మాత్రమే కాకుండా అక్కడున్న బంధువులు కూడా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement


ఈ పెళ్లికి సంబంధించిన వీడియోని డా. అజిత్ వర్వాంద్కర్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇంతకంటే మంచి పెళ్లి బహుమతిని ఏ స్నేహితుడూ ఇవ్వడు, వీడియో చూడటానికి ఎంతో సరదాగా ఉంది అంటూ ఫన్నీ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని మీరు చూసి మీ స్నేహితుల పెళ్లిలో ఇలాంటి గిఫ్ట్ ప్లాన్ చేసేయండి.

Advertisement
Advertisement