Drunkers in marriage: బీహార్ లో కల్తీ మధ్యం బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కల్తీ చేసిన మందు తాగుతూ చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మద్యం దొరకడం గగనం కావడంతో దొరికిన కాస్తంతా మందును విపరీతమైన కల్తీకి పాల్పడుతున్నారు. మద్యానికి బానిసలైన వారు కల్తీ అని కూడా చూడకుండా ఆ మందునే తాగుతుండటంతో తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి కల్తీ మద్యం తాగి కంటి చూపు కోల్పోయాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా బిహార్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మద్యపాన అమ్మకాన్ని నిషేధించింది. మద్యం అమ్మడం నేరం అని ప్రకటించింది. ఏలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఉన్నపళంగా మద్యపాన నిషేధం అమలు చేసే సరికి మొదటికే మోసం వచ్చే పరిస్థితి తలెత్తింది.
మత్తుకు బానిసలైన చాలా మంది మందు కోసం అల్లాడిపోతున్నారు. దీనినే అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. మద్యాన్ని విపరీతమైన కల్తీకి పాల్పడుతున్నారు. శరన్ జిల్లా బోరాహం గ్రామానికి చెందిన ముఖేష్ ఠాకూర్.. ఒక వివాహానికి హాజరయ్యాడు. అక్కడ జరిగిన పార్టీలో మద్యం సేవించాడు. అది పూర్తిగా కల్తీ మద్యం కావడంతో అతడిపై తీవ్ర ప్రభావం చూపింది. కల్లు మసక బారడంతో కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు కల్తీ మద్యం ప్రభావమని తేల్చారు. చికిత్స చేసినా ఫలితం ఉండటం లేదని, కంటి చూపు రావడంలేదని అతడి కుటుంబసభ్యులు చెబుతున్నారు. కల్తీ మద్యంతోనే ముఖేష్ కు ఇలా జరిగిందని వారు పోలీసులు ఫిర్యాదు చేశారు.