Babu Gogineni: దేవి నాగవల్లి, విశ్వక్ సేన్ మేటర్ లోకి ఎంటరైన బాబు గోగినేని.. తప్పెవరిది?

Updated on: May 6, 2022

Babu Gogineni: గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో యాంకర్ దేవి నాగవల్లి, విశ్వక్ సేన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విశ్వక్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్లో భాగంగా చేసిన ఫ్రాంక్ వీడియో ఎన్నో వివాదాలకు కారణం అయింది. ఈ క్రమంలోనే ఈ ప్రాంక్ వీడియో పై డిబేట్ నిర్వహించి పెద్ద ఎత్తున వివాదం సృష్టించారు.ఈ క్రమంలోనే ఈ వివాదంపై ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. కొందరు టీవీ యాంకర్ ను సమర్పించగా మరికొందరు హీరోని సమర్థిస్తూ వారికి మద్దతు తెలుపుతున్నారు.

ఇక ఈ వ్యవహారంలోకి మానవ హక్కుల సంఘం కార్యకర్త బాబు గోగినేని ఎంటరయ్యారు.ఈ క్రమంలోనే ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయం గురించి సోషల్ మీడియా వేదికగా పెద్ద పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రముఖ న్యూస్ ఛానల్ హీరో విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ వీడియోని తప్పుగా చూపెడుతూ అతనిపై, అతని మెంటల్ హెల్త్ కండిషన్ గురించి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ క్రమంలోనే ఆ న్యూస్ ఛానల్ గతంలో చేసిన ఫ్రాంక్ వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్ లను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

పెట్రోల్ అంటూ గతంలో ఆ న్యూస్ ఛానల్ ఫ్రాంక్ వీడియో చేశారు. ఫ్లాష్- ఫ్లాష్- ఫ్లాష్.. ‘మా అన్నొత్తేనే ఉంటా లేకపోతే నేను ఉండను!’ అని నీళ్లతో నిండిన పెట్రోల్ క్యాన్ పట్టుకుని రోడ్డు పక్కన సూసైడ్ ప్రాంక్ స్కిట్ చేసిన సరదా దృశ్యాలను ప్రసారం చేసింది అప్పుడు ఈ దృశ్యాలు ఎవరికీ న్యూసెన్స్ కాకపోవడం గమనార్హం. అదే ఫ్రాంక్ వీడియోని ప్రస్తుతం హీరో చేస్తే తప్పయింది. అయితే ఇక్కడ తప్పొప్పుల గురించి ప్రస్తావన కాదు రెండు ఒకటే ఫ్రాంక్ వీడియోలు. మొదటిది తప్పు కానప్పుడు రెండోది తప్పు ఎలా అవుతుంది అంటూ ఆయన ప్రశ్నించారు.అయితే ప్రస్తుతం ఆ వీడియోలను సదరు న్యూస్ ఛానల్ డిలీట్ చేసి ఉందని ఈ సందర్భంగా ఈయన తన వాదనను వినిపించారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel