Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో గౌతమ్ వసు ఫోటో చూసి మురిసి పోతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన రిషి,గౌతమ్ కి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు.
ఈరోజు ఎపిసోడ్ లు గౌతమ్ మాట్లాడుతూ సాక్షి అనే అమ్మాయి వచ్చింది కదా తను ఎవరు అని అడగగా అప్పుడు రిషి అవన్నీ ఎందుకు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఆ తర్వాత దేవయాని రిషి దగ్గరకు వచ్చి దేవుడు నీకు సాక్షితో ముడి పెట్టాడేమో రిషి అని అనగా అప్పుడు రిషి ఒకసారి నాది కాదు అనుకున్న తర్వాత నేను పాటించుకొను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు.
ఇంతలో అక్కడికి వచ్చిన సాక్షి లాంగ్ డ్రైవ్ కి వెల్దామా రిషి అని అడగగా పరాయి వాళ్లతో కలిసి ప్రయాణం చేసే అలవాటు నాకు కూడా లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆ రిషి నేరుగా వసు ఇంటికి వెళ్తాడు. ఇక రిషి,కారు ని సాక్షి దేవయాని ఫాలో అవుతుంటారు. ఇక వసు తో రిషి మాట్లాడుతూ ఉండగా సాక్షి ఫోన్ లో ఫోటోలు తీస్తుంది.
ఆ తరువాత రిషి వసు ని తీసుకుని వెళ్ళి రెస్టారెంట్ లో వదిలి వెళ్ళిపోతాడు. మరొక వైపు దేవయాని జగతీ రూమ్ కి వెళ్లి నువ్వు ఏమనుకుంటున్నావు ఇంట్లోకి వచ్చి గెలిచాను అని అనుకుంటున్నావా అని అడగగా అప్పుడు జగతి తన మాటలతో దేవయానికి బుద్ధి చెబుతుంది..
అప్పుడు జగతి సాక్షి బలాన్ని ఇవ్వడమే కాకుండా, రిషి ని ఫాలో అవుతున్నారు అని అనడంతో అప్పుడు దేవయాని జగతిని భయపెట్టడానికి చూడగా అప్పుడు జగతి భయపడడం మానేసి చాలా కాలం అయ్యింది అక్కయ్య అని చెబుతుంది. ఇక ఆ తరువాత వసు రిషి ని తన ఇంటికి తీసుకుని వెళ్లి తానే స్వయంగా వండిన రిషికీ వడ్డిస్తుంది.
అప్పుడు వసు మనకు ఇష్టమైన వారు అని అనగా అప్పడు రిషి వసు మనసులో ఏమి వుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రిషి (Rishi) వసు ఇంట్లో భోజనం చేసి వెళ్ళగానే ఇంతలో బస్తీ వాళ్ళు అక్కడికి వచ్చి వసు ని మండలిస్తారు. బస్తీ వాళ్ళ మాటలకు వసు హర్ట్ అవుతుంది. ఇంతలో రిషి ఫోన్ చేయడంతో నీకు ఏమి పని పాట లేదా పదేపదే కాల్ చేసి విసిగిస్తున్నావు అంటూ రిషి పై విరుచుకు పడుతుంది వసు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World