...

Shani Effect: పలు రాశులపై పడనున్న శని ప్రభావం.. దేశాధినేతలకు గడ్డుకాలమే.. ఈ రాశుల వారిపై శని ప్రభావం?

Shani Effect: సాధారణంగా గ్రహాలు రాశుల మార్పులు జరగడం సర్వసాధారణం ఈ క్రమంలోని ఏప్రిల్ 29వ తేదీ నుంచి జులై 12వ తేదీ వరకు గ్రహాలలో మార్పుల కారణంగా కొన్ని రాశి వారిపై శని ప్రభావం చూపించనుంది. శుభకృతనామ నామ సంవత్సర రారాజైన శని ఈ ఏడాది ఏప్రిల్ 29 వ తేదీ నుంచి జులై 12 వ తేదీ వరకు 75 రోజుల పాటు తన ప్రభావాన్ని పలు రాశుల వారిపై తీవ్రంగా చూపించనున్నారు. ఈ సంవత్సరంలో తన బద్ధ శత్రువు అయినటువంటి ధనిష్టా నక్షత్రంలో సంచరించనున్నారు.

Advertisement

ఏప్రిల్ 30వ తేదీన ఏర్పడిన పాక్షిక సూర్య గ్రహణంతో పాటు మే 15వ తేదీ ఏర్పడే పాక్షిక చంద్ర గ్రహణం వల్ల పలు గ్రహాల మార్పులు జరగడంతో కొన్ని రాశుల వారిపై శని ప్రభావం ఏర్పడుతుంది. అయితే ఈ రెండు గ్రహణాలు భారతదేశంలో కనిపించక పోయినప్పటికీ ఈ ప్రభావం కొన్ని రాశుల వారిపై ఉంది. ముఖ్యంగా దేశాధినేతలకు ఈ సమయం చాలా గడ్డుకాలమే అని చెప్పాలి.ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎంతో నష్టాన్ని భరించాల్సి ఉంటుంది.ఏప్రిల్ 29 నుంచి మే 18 వ తేదీ వరకు ఇవి సంభవించొచ్చు.

Advertisement

ఇక ఈ 75 రోజుల పాటు శని ప్రభావం మీన రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి వారిపై శని ప్రభావం పడనుంది. ఇక ఈ 75 రోజులు శుభదినాలు లేకపోవటం వల్ల వ్యాపార రంగంలోపెట్టుబడులు పెట్టే వారు ఈ కొద్ది రోజుల పాటు వేచి చూసిన అనంతరం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ఎంతో మంచిది లేకపోతే తీవ్రస్థాయిలో నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Advertisement
Advertisement