Akshay Tritiya: ఈ దోషంతో బాధపడేవారు అక్షయతృతీయ రోజు పెళ్లి చేసుకోవడం ఎంతో శుభప్రదం..?

Updated on: May 3, 2022

Akshay Tritiya: హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.అక్షయ తృతీయ రోజు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడమే కాకుండా లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇలా ఈ రోజు లక్ష్మీదేవిని పూజించి బంగారు నగలను కొనుగోలు చేయడం వల్ల మన సంపద అభివృద్ధి చెందుతుందని భావిస్తారు. అలాగే అక్షయ తృతీయ రోజు కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ రోజున మంచి పనులు చేయటం వివాహాలు చేయడం వల్ల శుభం కలుగుతుందని భావిస్తారు.

అక్షయ తృతీయలో అక్షయ అంటే అంతం లేనిది. అందుకే ఈ రోజు చేసే ఏ పని కైనా అంతం ఉండదని ఆ పని దిగ్విజయంగా పూర్తి అవుతుందని భావిస్తారు. అందుకే చాలామంది అక్షయ తృతీయ రోజు శుభకార్యాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ అక్షయ తృతీయ ప్రతి ఏడాది వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ రోజు వస్తుంది.ఈ రోజు కనుక జాతకంలో కుజ దోషం ఉన్నవారు వివాహం చేసుకుంటే వారికి కుజ దోష ప్రభావం తొలగిపోతుందని పండితులు తెలియజేస్తున్నారు.

ఈ విధంగా కుజదోషంతో బాధపడేవారు అక్షయ తృతీయ రోజున వివాహం చేసుకోవడం వల్ల వారి జాతకంలో దోషం తొలగిపోయి వారి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది. అక్షయతృతీయ వంటి ఎంతో పవిత్రమైన రోజున వివాహం చేసుకోవటం, శుభకార్యాలు చేసుకోవటం వల్ల హానికరమైన గ్రహాల ప్రభావం మనపై ఉండదని, అందుకే ఇంతటి పవిత్రమైన ఈ రోజున పెళ్లిళ్లు శుభకార్యాలు చేయటం మంచిదని పండితుల తెలియజేస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel