Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు ఇంటినుంచి వెళ్లి పోయినందుకు రిషి బాధపడుతూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి, రిషి దగ్గరకు వచ్చి నువ్వు చాలా మారిపోయావు. నీ మీద నాకున్న ప్రేమ ఇంకా తగ్గలేదు. అందుకే నీ కోసం నేను లండన్ నుంచి తిరిగి వచ్చేసాను అని చెబుతుంది. కానీ రిషి మాత్రం కోపంతో వచ్చిన దారిలోనే వెళ్ళిపో అంటూ సాక్షిపై కోప్పడతాడు. కానీ సాక్షి మాత్రం నీతోనే నా జీవితం అని డిసైడ్ అయ్యాను అని అంటుంది.

సాక్షి మాటలకు కోపంతో రిషి అక్కడి నుంచి వెళ్ళి పోతాడు. ఆ తర్వాత రిషి ఇంట్లో నుంచి బయటకు కారులో వెళుతూ వసు తో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు వసు కూడా నేను రిషి సార్ గురించి ఇంతలా ఆలోచించడానికి కారణం ఏమై ఉంటుంది.. రిషి సార్ ని ప్రశ్నించాను కానీ నన్ను నేను ప్రశ్నించుకోలేక పోతున్నాను అని అనుకుంటూ ఉంటుంది.
ఒకవైపు రిషి పార్కులో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. వసు కీ నాకు మధ్య ఏం సంబంధం ఉంది. నేను వసు గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు కొత్త ఇంటికి వెళ్లిన వసుధార అక్కడ బస్తీలోని పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెబుతాను అని అనడంతో అక్కడే ఉన్న ఒక పెద్ద ఆమె బస్తి లో ఉన్న పిల్లలందరికీ ఆ విషయాన్ని చెప్పడంతో పిల్లలు అందరూ వసు కోసం స్వీట్స్ తీసుకుని వస్తారు.
మరొకవైపు రిషి, జగతి మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి సాక్షి వస్తుంది. కాలేజీ లోకి వచ్చే ముందు అపాయింట్మెంట్ తీసుకొని రావాలి అని తెలియదా అని అనగా మనలో మనకు ఇవన్నీ ఎందుకు లే అని అనడంతో కోపంతో రిషి ఆమెపై అరిచి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. రిషి అటుగా వెళ్తుండగా ఆటోలో వసుధార వెళ్లడం చూసి ఆటోని ఫాలో అవుతాడు.
కానీ మధ్యలోకీ వెళ్లగానే వసు ఆటో కనిపించదు దీంతో రిషి బాధపడుతూ ఉంటాడు. ఇంటికి వెళ్ళిన వసు పిల్లలతో కలసి దాగుడు మూతలు ఆడుతూ ఉండగా ఇంతలో తెలియకుండా పక్కనే ఉన్న రిషి వచ్చి పట్టుకుంటుంది. ఎవరా నువ్వు నీ పేరు చెప్పు అని అనడంతో రిషేంద్ర భూషణ్ అంటాడు.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి వసు కొత్త ఇంటికి వెళ్తారు. వసు కీ ఏదో చెప్పాలి అని వెళ్లిన రిషి, వసు ని చూడగానే ఆనందంతో అది మర్చిపోయి ఇంటికి వచ్చేస్తాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
- Guppedantha Manasu Oct 18 Today Episode : గౌతమ్ తో ఎమోషనల్ గా మాట్లాడిన రిషి.. రిషి గురించి ఆలోచిస్తున్న మహేంద్ర జగతి..?
- Guppedantha Manasu july 19 Today Episode : వసుధారని పొగిడిన రిషి.. సాక్షికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రిషి..?
- Guppedantha Manasu July 23 Today Episode : ఒకే వలలో చిక్కుకున్న వసు, రిషి.. వీడియో తీసిన సాక్షి..?















