Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు ఏ రాశి వారు ఏ దానాలను చేయాలో తెలుసా?

Akshaya Tritiya 2022:పురాణాల ప్రకారం బ్రహ్మ కుమారుడు అక్షయ్ కుమార్ జన్మించిన రోజున అక్షయ తృతీయను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తిథి రోజున ప్రతి ఏడాది అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు.ఈ క్రమంలోనే ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజు బంగారం వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం ఎంతో మంచిదని ప్రతి ఒక్కరు అక్షయ తృతీయ రోజు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా మనం ఏదైనా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే అక్షయ తృతీయ రోజు ఈ దానాలు చేయడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మరి అక్షయ తృతీయ రోజు ఎవరు ఏ దానాలు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…

మేష రాశి: ఈ రాశివారు అక్షయ తృతీయ రోజు ఎరుపు రంగు వస్త్రం, లడ్డూలను దానం చేయాలి.

Advertisement

వృషభం: వృషభ రాశి వారు అక్షయతృతీయ రోజు నీటితో నిండిన కలశం దానం చేయాలి.

మిథునం: ఈ రాశివారు చంద్రుడి అనుగ్రహం కోసం అక్షయ తృతీయ రోజు పప్పు దానం చేయాలి.

కర్కాటకం: ఈ రాశివారికి చంద్రుడు అధిపతి కనుక ముత్యంతో ఉన్న నగలను ధరించడం వల్ల ఈ రాశి వారికి చంద్ర బలం పెరుగుతుంది.

Advertisement

సింహం: అక్షయ తృతీయ రోజు సింహ రాశి వారు ఉదయమే నిద్రలేచి సూర్యునికి నీటిని సమర్పించి అనంతరం బెల్లం దానం చేయాలి.

కన్య: కన్య రాశి వారు నవరత్నాలలో ఒకటైన పచ్చ ధరించడం ఎంతో మంచిది. అక్షయ తృతీయ రోజు దీనిని ధరించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

తుల: తులా రాశి వారు అక్షయ తృతీయ రోజు తెల్లని వస్త్రాలను దానం చేయడం ఎంతో మంచిది.

Advertisement

వృశ్చిక రాశి: ఈ రాశివారు అక్షయ తృతీయ రోజు పగడం ధరించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

ధనస్సు రాశి: ఈ రాశివారు అక్షయ తృతీయ రోజు పసుపు రంగు దుస్తులను, వస్త్రాలను దానం చేయాలి.

మకర రాశి మకర రాశి వారు అక్షయ తృతీయ రోజు నువ్వుల నూనెను దానం చేయటం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు.

Advertisement

కుంభం: కుంభ రాశి వారు అక్షయ తృతీయ రోజు నల్లని నువ్వులు, కొబ్బరి, ఇనుము దానం చేయడం వల్ల ఎంతో శుభ ఫలితాలను పొందవచ్చు.

మీనం:మీన రాశి వారు అక్షయ తృతీయ రోజు పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel