Acharya movie : ఈనెల 29వ తేదీన విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. అలాగే ఐదో షో విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా టిక్కెట్ ధరను 50 రూపాయలు పెంచుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీ నుంచి పది రోజుల పాటు మాత్రమే కొత్త ధరలు అమల్లో ఉంటాయని పేర్కొంది.

100 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం దాటిన చిత్రాలకు టిక్కెట్ ధర పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, సంయుక్త కలెక్టర్లు, లైసెన్సింగ్ అథారిటీలు తగిన చర్యలు తీసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
Read Also : Big Boss Non Stop Telugu: 9వ వారం నామినేషన్స్ లో ..ఉన్న కంటెస్టెంట్ వీళ్ళే?