Police notification : నిరుద్యోగులతు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో సంవత్సరాలుగా నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న… పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజైంది. అయితే మొత్తం 17 వేల 99 పోస్టులు ఖాళీగా ఉండగా… అందులో 587 ఎస్సై పోస్టులు.. 16, 027 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అలాగే 414 సివిల్ ఎస్ఐలు, 66ఏఆర్ ఎస్ఐ, 5 రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అచితే పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు మే 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. విషయం తెలుసుకున్న నిరుద్యోగులు అంతా ఆనందంతో ఉబ్బితబ్బిపై పోతున్నారు. ఎలాగైనా సరే కచ్చితంగా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదువుతున్నారు. అంతే కాదు మైదానానికి వెళ్లి రన్నింగ్ వంటివి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇన్నాళ్ల తర్వాత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం సంతోషంగా ఉందని తెలిపారు.
Read Also :Police notification: పోలీసు పరీక్షా విధానాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!