Rashmika: స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ రచ్చ చేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక… అమ్మడి ఎంజాయ్ మెంట్ మామూలుగా లేదుగా?

Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దూసుకుపోతున్నారు.తెలుగు, తమిళ, హిందీ భాషలలో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న రష్మిక పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పటికే హిందీలో రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మరొక సినిమా చర్చలలో ఉన్నట్టు తెలుస్తోంది.

Rashmika
Rashmika

ఇకపోతే తెలుగులో కూడా భారీ బంపర్ ఆఫర్ కొట్టినట్లు తెలుస్తోంది.కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే అవకాశాన్ని రష్మిక దక్కించుకున్నట్లు తెలుస్తోంది.ముందుగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అనుకోని విధంగా ఆలియా పెళ్లి చేసుకోవడంతో కొన్ని రోజుల పాటు ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.ఈ క్రమంలోనే ఈ అవకాశాన్ని రష్మిక అందుకున్నట్టు సమాచారం.ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Advertisement

ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇప్పటికే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరొక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ సేద తీరుతున్నారు. వివిధ భంగిమలలో ఈత కొడుతూ రష్మిక తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరు ఓ లుక్ వేయండి.

Read Also :Rashmika Mandanna : శ్రీవల్లి.. రష్మిక రచ్చ.. ఇంతగా అందాలు ఆరబోస్తే.. కుర్రకారు ఆగేదెట్టా.. వీడియో..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel