Hair Growth: అమ్మాయిలు అందం రెట్టింపు కావాలంటే జుట్టు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది అమ్మాయిలు పొడవైన ఒత్తైన జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విధంగా పొడవైన జుట్టు కోసం మార్కెట్లో లభించే వివిధ రకాల హెయిర్ కండిషనర్ ఉపయోగిస్తూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జుట్టు పెరుగుదల ఏ మాత్రం ఉండదు. ఈ విధంగా పొడవైన అందమైన జుట్టు కోసం ప్రయత్నించే వారు మన ఇంటిలో సహజసిద్ధంగా తయారు చేసుకునే హెయిర్ కండీషనర్ వాడటం వల్ల అందమైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు.
మరి సహజసిద్ధమైన హెయిర్ కండిషనర్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే విషయానికి వస్తే… సహజసిద్ధమైన హెయిర్ కండీషనర్ ఉపయోగించడానికి బాగా పండిన ఒక అరటిపండు, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ తేనె కావాలి.ఒక గిన్నెలోకి బాగా పండిన అరటిపండు గుజ్జు వేసి అనంతరం ఆ గిన్నెలోకి ఆలివ్ ఆయిల్, తేనె మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా అంటించాలి.
ఇలా హెయిర్ కండీషనర్ తలకు పెట్టిన తర్వాత 30 నిమిషాల పాటు అలాగే ఉంచి అనంతరం తల స్నానం చేయాలి.ఇలా వారంలో ఒక సారి చేయడం వల్ల జుట్టు పెరుగుదల ఉండటమే కాకుండా ఇతర జుట్టు సమస్యలు కూడా తొలగిపోయి ఎంతో అందమైన నల్లటి ఒత్తయిన పొడవాటి జుట్టు మీ సొంతం అవుతుంది. మరెందుకాలస్యం వెంటనే ఈ చిట్కా ప్రయత్నించి చూడండి.