SBI Lending Rates Increased : ఎస్బీఐ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. ఈఎమ్ఐలు మరింత భారం!

SBI Lending Rates Increased : దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ).. రుణ రేట్లను స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎమ్‌సీఎల్‌ఆర్‌) ఆధారిత రుణ రేట్లను 10 బేసిస్‌ పాయింట్ల (0.1 శాతం) మేర పెంచినట్లు ప్రకటించింది. పెంచిన రేట్లు ఏప్రిల్​ 15 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తన వెబ్​సైట్​లో ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

ఫలితంగా ఆయా రుణాల ఈఎంఐలు మరింత పెరగనున్నాయి. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణాలను తీసుకొని ఈఎంఐలుగా చెల్లిస్తున్న వారిపై ఈ భారం పడనుంది. అయితే ఎస్​బీఐ మాదిరిగా భవిష్యత్​లో మరిన్ని బ్యాంకులు రుణ రేట్లను పెంచుకునే అవకాశం ఉంది.

SBI Lending Rates Increased
SBI Lending Rates Increased

ఎంసీఎల్ఆర్​లో మార్పులు.. రుణ రేటు పెంపు వల్ల ఎంసీఎల్ఆర్​లో మార్పులు ఇలా ఉన్నాయి. ఓవర్‌నైట్, నెల, మూడు నెలల మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లు 6.65 శాతం నుంచి 6.75 శాతానికి పెరిగాయి. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 6.95 శాతం నుంచి 7.05 శాతానికి ఎగబాకింది. ఏడాది ఎంసీఎల్ఆర్ ఇది వరకు 7 శాతం ఉండగా.. కానీ ఇప్పుడది 7.10 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ కూడా 7.2 శాతం నుంచి 7.3 శాతానికి పెరిగింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 7.3 నుంచి.. 7.4 శాతానికి చేరుకుంది.

Read Also : Kajal Aggarwal : ఫ్యాన్స్‌కు పండగే.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్..!