Pudeena Juice : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరూ షర్బత్ లు జ్యూస్ లు తెగ తాగేస్తుంటారు. అలాగే కొబ్బరి బోండాలు కూడా. అయితే కేవలం చల్లదనాన్ని ఇచ్చేవే కాకుండా ఇమ్యూనిటీ దాంతో పాటు శరీరానికి తేమను ఇచ్చే జ్యూసులు తాగడం మరింత మంచిది. అయితే రోగ నిరోధక శక్తిని పెంచే షర్బత్ ను ఓసారి ట్రై చేసి చూస్తే.. మీకే అర్థం అవుతుంది. ముందుగా ఒక కప్పు పుదీనా ఆకులు తీసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ, మూడు టేబుల్ స్పూన్ ల తేనె, వేయించిన జీలకర్ర పొడి… వీటన్నిటిని మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
అవసరం ఉన్నన్ని నీళ్లు కలుపుతూ.. పలుచటి మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గాజు గ్లాసులోకి తీసుకొని ఐస్ ముక్కల్ని చేర్చుకుంటే సరి. ఇలా చిటికెలో రెడీ అయ్యే చల్ల చల్లటి నిమ్మ పుదీనా షర్బత్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ షర్బత్ లో ఉండే నిమ్మ, పుదీనా ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే శరీరంలోకి ప్రవేశించిన వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
ఇంకా తేనెలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బీపిని అదుపు చేయడానికి, గుండె ఆరోగ్యానికి తేనె ఎంతో అవసరం. శరీరంలో అనవసర కొవ్వుల్ని తగ్గించి బరువును అదుపులో ఉంచడంలో జీలకర్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరానికి తేమెను అందించే గుణాలు ఈ షర్బత్ లో విరివిగా ఉన్నాయి. తద్వారా ఈ మండుటెండల్లో శరీరం డీహైడ్రేషన్ కి గురి కాకుండా కాపాడుకోవచ్చు.