Booster Dose : 18 ఏళ్ల పైబిడిన వారందరికీ కరోనా బూస్టర్ డోస్ టీకా..!

Booster Dose : కరోనా మహమ్మారి తన రూపును మార్చుకుంటూ… కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలపైకి దూసుకొస్తుంది. అయితే దాన్ని ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ కొవిడ్ బూస్టర్ టీకా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 10వ తేదీ.. అంటే ఈ ఆదివారం నుంచే ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వయోజనులు అందరికీ కరోనా టీకా ప్రికాషన్ డోసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. కరోనా టీకా రెండో డోసు తర్వాత తొమ్మిది నెలల పూర్తయిన వారు బూస్టర్ డోసు తీసుకోవడానికి అర్హులని వివరించింది.

ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా అర్హులైన వారందరికీ కరోనా మొదటి, రెండో డోసు టీకాతో పాటు ఆరోగ్య కార్యకర్తలందరికీ, 60 ఏళ్లు పైనున్నవారికి ఇస్తున్న బూస్టర్ డోసును యథావిధిగా కొనసాగిస్తారు. ఇప్పటి వరకు దేశంలో 15 ఏళ్ల పైనున్న 96 శాతం జనాభాకు కనీసం ఒక డోసు టీకాను ఇచ్చారు. అయితే 83 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. 2.4కోట్ల ప్రికాషన్ డోసులను ఆరోగ్య కార్యకర్తలకు, 60 ఏళ్లు పైనున్నవారికి పంపిణీ చేశారు. 12-14 ఏళ్ల పిల్లల్లో 45 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు.

Read Also : Prabhas: సర్జరీ నుంచి కోలుకున్న ప్రభాస్.. మళ్లీ సెట్ లో వచ్చేది అప్పుడేనట…!