October 5, 2024

Petrol Prices Today : వాహనదారులకు గుడ్ న్యూస్.. రెండ్రోజులుగా పెరగని ఇంధన ధరలు!

1 min read
Petrol Prices Today

Petrol Prices Today

Petrol Prices Today : భారత దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు నిన్న, ఈరోజు పేట్రో బాదుడుకు కాస్త విరామం ఇచ్చాయి. దీంతో వాహన దారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గురువారం, శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 105.45, లీటర్ డీజిల్ ధర​ రూ. 96.71గా ఉంది.

ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది.హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.121.24కు చేరింది. డీజిల్ ధర రూ.106.91కు చేరుకుంది. వైజాగ్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.88కు చేరుకుంది. డీజిల్ ధర రూ.105.66కు ఎగ బాకింది.

Read Also : New Traffic Rules : హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తే మూడు నెలలు లైసెన్స్ రద్దు..!