RK Selvamani : ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్తపై అరెస్ట్ వారెంట్..!

Updated on: April 6, 2022

RK Selvamani : ప్రముఖ దర్శకుడు, దక్షిణ భారత చలన చిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్త ఆర్కే సెల్వ మణిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పరువు నష్టం కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో చెన్నై జార్జిటౌన్‌ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

2016లో సెల్వమణి, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే అరుళ్‌ అన్బరసు ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో ఫైనాన్షియర్‌ ముకుంద్‌ చంద్‌ బోద్రా గురించి పలు అభిప్రాయాలు వెల్లడించారు. దీంతో బోద్రా వారిద్దరిపై జార్జిటౌన్‌ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

బోద్రా మృతి చెందాక, కేసును అతని కుమారుడు గగన్‌ బోద్రా కొనసాగిస్తున్నారు. ఈ కేసు మంగళ వారం విచారణకు రాగా, సెల్వమణి, అరుళ్‌ అన్బరసులు కోర్టుకు హాజరు కాలేదు. వారి తరఫున న్యాయ వాదులు కూడా రాలేదు. దీంతో న్యాయమూర్తి వారిద్దరిపై బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేస్తూ విచారణను 23కు వాయిదా వేశారు.

Advertisement

Read Also : Varun Tej: నిహారిక పబ్ వ్యవహారం… వరుణ్ మెడకు చుట్టుకొనుందా… ఆందోళన చెందుతున్న మెగాఫ్యామిలీ!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel