...
Telugu NewsLatestProperty Tax : ఆస్తి పన్నులో 5 శాతం రాయితీ.. ఎప్పటి వరకంటే?

Property Tax : ఆస్తి పన్నులో 5 శాతం రాయితీ.. ఎప్పటి వరకంటే?

Property Tax : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించే వారికి 5 శాతం పన్ను రాయితీని వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement

పురపాలక శాఖ డైరెక్టర్‌ పరిధిలోని 128 పురపాలక సంఘాలు, 13 నగరపాలక సంస్థల్లో ఈ నెల 30లోపు చెల్లించేవారికి ఎర్లీబర్డ్‌ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పురపాలక శాఖ డైరెక్టర్ కోరారు. జీహెచ్‌ఎంసీలో కూడా ఆస్తి పన్నును ఈ నెల 30లోపు చెల్లించేవారికి 5 శాతం రాయితీని అమలు చేస్తున్నారు.

Advertisement

రాష్ట్రంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.698 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. ఇది లక్ష్యంలో 86 శాతం మాత్రమే. అయితే పురపాలక శాఖ తీసుకున్న ప్రత్యేక చర్యలతో ఇదంతా సాధ్యమైందని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సారి ప్రతి ఆస్తికి క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా డిమాండ్‌ నోటీసులు ఇవ్వడం వల్ల దాని సాయంతో ఆన్‌లైన్‌లో నేరుగా చెల్లించేందుకు అవకాశం కలిగిందన్నారు.

Advertisement

Read Also : Shankar Ram Charan : పొలిటిషియన్ లుక్‌లో సైకిల్‌పై రామ్ చరణ్.. ఫొటో లీక్..!

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు