Sai Pallavi Latest Pics : తెలుగు, తమిళ్, మలయాళ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం అభినయంతో వరసు అవకాశాలు దక్కించుకుంటూ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుందీ అందాల ముద్దుగుమ్మ. భిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ అభిమానుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుంది. అయితే తాజాగా ఆమె కూలీగా మారి పొలంలోకి అడుగు పెట్టింది. దీంతో అక్కడే ఉన్న మహిళా కూలీలందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శారీరకం అందంతో పాటు నీ మనసు కూడా బంగారం అంటూ అక్కడున్న వారంతా మెచ్చుకున్నారు.
ఇటీవలే శ్యామ్ సింగరాయ్ తో ప్రేక్షకులను అలరించిన సాయి పల్లవి ప్రస్తుతం షూటింగ్ కి కాస్త విరామం ఇచ్చింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆమె రైతుగా మారింది. కూలీలతో కలిసి పనులు చేసింది. అయితే ఈ ఫొటోలను సాయి పల్లవి ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో సాయి పల్లవి మరింత ముద్దుగా కనిపించడంతో విపరీతంగా వైరల్ అయ్యాయి. సాయి పల్లవి నీలా ఎవ్వరూ ఉండలేరంటూ నటి శ్రద్ధా శ్రీనాథ్ ప్రశంసించారు.
Read Also : Niharika Pub Case : బంజారాహిల్స్ పబ్ కేసులో ప్రముఖులు.. నిహారికకు పోలీసుల నోటీసులు!