Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

రిషి, వసు ని ఇంటిదగ్గర డ్రాప్ చేయడానికి వెళతాడు. అప్పుడు వసు అప్పుడే ఇల్లు వచ్చేసిందా సార్ అని అనగా, లేదు మనమే ఇంటి దగ్గరికి వచ్చాను అని అంటాడు రిషి. ఇక వసు కారు దిగి వెళ్తుండగా బొకే ఇచ్చి మినిస్టర్ గారిని బాగా ప్రభావితం చేసినందుకు ఆ ఇద్దరికీ నా బహుమానం కింద ఇది ఇవ్వు అనే వసుధార కు చెబుతాడు రిషి.
అప్పుడు వసు ఆ గిఫ్ట్ ని తీసుకెళ్లి మహేంద్ర ఇవ్వగా మహేంద్ర దాన్ని చూసి ఆనందపడతాడు. జగతి కూడా రిషి పంపించిన గిఫ్ట్ ను చూసి ఆనంద పడుతుంది. అప్పుడు జగతి మాట్లాడుతూ మనిషి మనసు ఈ పువ్వు లాంటిది కాస్త ఎండిపోయినా కూడా నేను తట్టుకోలేదు అని చెబుతుంది.
మరొక వైపు దేవయాని జరిగిన విషయాన్ని తలచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. జగతి తనను అవమానించే విధంగా మాట్లాడింది అంటూ లోలోపల కుమిలిపోతు ఉంటుంది. ఇంతలో రిషి రావడం చూసిన దేవయాని దొంగ ఏడుపులు ఏడుస్తూ జగతి ఇంటికి వెళ్లిన విషయాన్ని చెబుతూ అక్కడ తనని అవమానించి నానా మాటలు అన్నారు అని చెబుతుంది.
అంతేకాకుండా జగతి గురించి మరింత నెగిటివ్ గా చెప్పడంతో రిషి, జగతిపై మరింత కోపం పెంచుకుంటాడు. ఇక అప్పుడు దేవయాని నీ కన్న తల్లి జగతి అని అనగా అప్పుడు రిషి కోపంతో రగిలిపోతూఆమె నా కన్నతల్లి కాదు అని కోపంగా అంటాడు.
అనంతరం దేవయాని ని ఓదార్చి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆ తర్వాత జగతికి కాలేజీ స్టాప్ కాల్ చేసి మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో రిషి సార్ కు కాలేజీ లో కొంత వ్యతిరేకత ఉంది అని ఇదే విషయంపై సార్ తో డైరెక్ట్ గా మాట్లాడాలి అనుకుంటున్నాము అని చెబుతుంది.
మరొకవైపు రిషి ని కాలేజీ స్టాఫ్ మిషన్ ఎడ్యుకేషన్ విషయం గురించి నిలదీస్తూ ఉండగా ఎండీగా నా నిర్ణయం కరెక్ట్ అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంతలో వసు అక్కడికి రావడంతో వాళ్ళ తరపున వాదించడానికి నువ్వు వచ్చావా అంటూ వసుధార పై కోప్పడతాడు. ఆ తర్వాత మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు ను రద్దు చేసిన విషయాన్ని నోటీస్ బోర్డులో వేయిస్తాడు రిషి.
నోటీస్ బోర్డ్ లో ఆ విషయాన్ని చూసిన కాలేజ్ మొత్తం షాక్ అవుతుంది. ఆ విషయం తెలుసుకున్న గౌతమ్ కూడా షాక్ అవుతాడు. ఇంతలో వసుధార దగ్గరకు కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి ప్రాజెక్టును ఎందుకు రద్దు చేశారు అంటూ రచ్చ రచ్చ చేస్తారు. అయితే వారికి వసు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే అదిచూసిన రిషి, వసు ని తప్పుగా అర్థం చేసుకుంటాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..
- Guppedantha Manasu Dec 5 Today Episode : అమెరికాకు వెళ్ళిపోతున్న గౌతమ్.. జగతిని అవమానించిన దేవయాని..?
- Guppedantha Manasu july 7 Today Episode : రిషి ఆలోచనలతో సతమతమవుతున్న వసు.. వసుని గెట్ అవుట్ అంటూ అవమానించిన జగతి..?
- Guppedantha Manasu january 27 Today Episode : సరికొత్త ప్లాన్ వేసిన రాజీవ్.. రిషిని చూసి బాధపడుతున్న మహేంద్ర..?













