September 21, 2024

AP Assembly: అసెంబ్లీలోకి నో సెల్ ఫోన్.. స్పీకర్ తమ్మినేని రూలింగ్…అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు?

1 min read
pjimage 2022 03 17T194748.820

AP Assembly: గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలలో భాగంగా ఏడవ రోజు కూడా అసెంబ్లీలో పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనల మధ్య జరుగుతున్నాయి.వరుసగా ఏడో రోజు అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదనలు జరిగాయి. ఇక ఏడవ రోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సభలోకి సెల్ఫోన్లను తీసుకురావడానికి అనుమతి లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం రూలింగ్ ఇచ్చారు. అయితే ఈ విషయంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

pjimage 2022 03 17T194748.820టిడిపి నేతలు అసెంబ్లీలో జరుగుతున్న సంఘటనలను సెల్ ఫోన్ ద్వారా వీడియో చిత్రీకరించి బయట మీడియాకు పంపిస్తున్నారని ఆరోపణలు రావడం చేత సభలోకి సెల్ ఫోన్లు అనుమతి లేదని స్పీకర్ వెల్లడించారు.ఈ క్రమంలోనే వైసీపీ నేతలు కూడా సెల్ఫోన్స్ తీసుకు వస్తున్నారని వాదించడంతో ఎవరికి కూడా అసెంబ్లీలో సెల్ఫోన్ అనుమతి లేదని తెలిపారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ సెల్ఫోన్లను వాలంటరీగా సరెండర్ చేయాలని వెల్లడించారు.

ఏడవ రోజు బడ్జెట్ సమావేశాలలో భాగంగా టిడిపి నేతలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్దఎత్తున నిరసనలు చేయడమే కాకుండా జంగారెడ్డి గూడెం ఘటనను ప్రస్తావించారు. ఇలా మరోసారి జంగారెడ్డి గూడెం వరుస మరణాల గురించి సభలో ప్రస్తావించడంతో కాసేపు సభ మొత్తం హాట్ హాట్ గా మారిపోయింది.