September 21, 2024

Devatha: రాధ, ఆదిత్యల విజయంలో రమ్య ప్లాన్ సక్సెస్.. మాధవ ఏం చేయనున్నాడు..?

1 min read
cSJWIal7

Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

cSJWIal7

ఆదిత్యను దేవుడమ్మ కుటుంబం ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు. పదేళ్ల బిడ్డకు సరిపోయే వస్తువులన్నీ కూడా ఎందుకు చేస్తున్నావు అని నిలదీస్తూ ఉంటారు. ఇంతలోనే ఆదిత్య కు రాధ కాల్ చేయడంతో మాట్లాడడానికి పక్కకు వెళతాడు. ఇక చెప్పు అని అనగానే నీ గురించి దేవమ్మ కు ఎంత మంచిగా చెబుదాము అనుకున్నా కూడా వినడం లేదు, కాబట్టి దేవమ్మను స్కూల్ కి తీసుకొని వస్తున్నాను నువ్వు కూడా రా, నీ బిడ్డకు ఏం చెప్పు కుంటావో ఏం తిట్టు ఉంటావో నీ ఇష్టం అంటుంది రాద.

అప్పుడు ఆదిత్య సరే అంటూ సంబరంగా అక్కడి నుంచి బయలు దేరుతాడు. ఇక రాధ, చిన్మయి, దేవీలు స్కూల్ కి వెళ్ళేసరికి అక్కడ ఆదిత్య పిల్లలందరికీ చాక్లెట్స్ పంపుతూ ఉంటాడు. చిన్మయి బర్త్ డే సందర్భంగా ఆఫీసర్ అంకుల్ మా అందరికీ చాక్లెట్ ఇస్తున్నాడు అని పిల్లలు చెబుతారు. అప్పుడు దేవి కోపం తో రగిలిపోతుంది.

మా అక్క బర్త్ డేకి సార్ చాక్లెట్ పంచుడు ఏంటి అంటూ? కోప్పడుతుంది. అప్పుడు రాద ఆ సారు ఏం తప్పు చేశాడు. ఎందుకు ఆ సార్ ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అని అంటుంది. మరొకవైపు రమ్య ఆదిత్య, రాధ ఇద్దరు మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్ మాధవ కు వినిపిస్తుంది. అప్పుడు మాధవా కూడా రాధ గతంలో దేవికి ఆదిత్య గురించి మంచిగా చెప్పిన విషయాలను గుర్తు తెచ్చుకుంటుంది.

రమ్య రాధా విషయంలో లేనిపోనివన్నీ సృష్టించి మాధవ కు చెబుతుంది. మరొకవైపు స్కూల్ లో చిన్మయి పుట్టినరోజు సందర్భంగా అక్కకు నువ్వు ఏమీ ఇవ్వవా అని రాధా అడగగా.. అప్పుడు దేవి అక్క ఏది అడిగిన ఇస్తాను అని అనడంతో వెంటనే చిన్మయి ఏది అడిగినా ఇస్తావా అంటూ ప్రామిస్ చేయించుకుంటుంది.

ఇక అప్పుడు చిన్మయి నువ్వు ఆఫీసర్ సారు తో ముందులాగే మాట్లాడాలి.కోపంగా ఉండకూడదు అని అనడంతో దేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరోవైపు రమ్య కాల్ రికార్డు మొత్తం మాధవ కు వినిపిస్తూ ఉంటుంది. దీనితో మాధవ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మాధవ రాధా విషయంలో బాగా కోపం తెచ్చుకోవడంతో ఇదంతా నేనే చేశాను అని రాధకు చెప్పకు, ఆఫీసర్ కి చెప్పిన ఉద్యోగం పోయేలా చేస్తుంది అంటూ రిక్వెస్ట్ చేస్తుంది రమ్య.

అప్పుడు మాధవ సరే ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చిన్మయి కి ఇచ్చిన మాట కోసం దేవి వెళ్లి ఆదిత్య తో మాట్లాడుతుంది. మా అక్క కు ఇచ్చిన మాట కోసం నీతో మాట్లాడుతున్నా అని అనడంతో ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. నేను మీ అమ్మను బాధ పెట్టాను అని కదమ్మా నామీద నీకు కోపం.. ముందే మీ అమ్మకు క్షమాపణలు చెబుతాను అంటూ దేవిని రాదా దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఆదిత్య. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.