Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో అనసూయ దంపతులు తులసి కలిసి అంకిత, అభిలను కలపాలి అని ఆలోచిస్తూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ తన కూతురు హనిని దగ్గర పడుకోబెట్టుకుని గతంలో తాను తులసి అన్న మాటలను తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తులసి మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయావు. హనీ కి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో ఎక్కడ ట్రీట్మెంట్ జరగదు అని అమ్మ స్థానంలో తులసి పేరు రాయించుకుంది అని అంటాడు.
ఆ తర్వాత హని చెప్పిన మాటలు అన్నీ కూడా సామ్రాట్ కి వివరిస్తాడు వాళ్ళ బాబాయ్. అప్పుడు సామ్రాట్ బాధపడుతూ తులసికి నష్టపరిహారంగా డబ్బులు ఇస్తాను అని అంటాడు. అప్పుడు వాళ్ళ బాబాయ్ తులసి డబ్బు మనిషి కాదు అనగా సామ్రాట్ వినకుండా డబ్బులు ఎలా అయినా పంపించాలి అని అనుకుంటాడు. మరొకవైపు అంకిత ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది.
ఇంతలో తులసి ఎక్కడికి వచ్చి అవి నీ పండుగకు పిలవాలి అనుకుంటున్నాను అని అనడంతో అంకిత ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు తులసి ఏంటి అంకిత ఏం మాట్లాడడం లేదు అని అనగా వెంటనే అంకిత మీ కొడుకు మీ ఇల్లు మీ ఇష్టం ఆంటీ అని అంటుంది. ఆ తర్వాత అంకిత మాటలకు తులసి ఆలోచించి అంకితకు అభి గురించి అర్థమయ్యే విధంగా చెబుతుంది.
అబి ని మాత్రమే కాదు ప్రేమ్ వాళ్ళను కూడా ఇక్కడికే పిలుస్తాను వాళ్ళు కూడా ఇకపై ఇక్కడే ఉంటారు అనడంతో అంకిత సంతోషపడుతుంది. ఆ తర్వాత శృతి తన అత్త ఇంటికి వచ్చి బాధపడుతూ జరిగింది మొత్తం వివరిస్తుంది. దాంతో తులసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు శృతి నేను ఇంకా ప్రేమ్ దగ్గరికి వెళ్ళను ఆయనకు నా గురించి తెలియాలి నా కోసం వెతకాలి అని అంటుంది.
మరొకవైపు ప్రేమ్ నిద్ర లేచి చూసేసరికి శృతి కనిపించకపోవడంతో కంగారు పడుతూ ఉంటాడు. నైట్ తాగిన మైకంలో శృతిని అనరాని మాటలు అన్నాను అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే శృతి రాసిన లెటర్ దొరకటంతో శృతి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని ఆ లెటర్ లో రాసి ఉంటుంది. ఇక అప్పుడు ప్రేమ్ శృతి కోసం కంగారు పడుతూ ఉంటాడు.
ఇంతలోనే తులసి ప్రేమ్ కి ఫోన్ చేసి శృతికి ఇవ్వమని అడుగుతుంది అప్పుడు ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత తులసి ఇంటికి రమ్మని చెప్పడంతో వస్తాము అని చెప్పి ఫోన్ కట్ చేసి శృతిని వెతకడం మొదలు పెడతాడు. ఆ తర్వాత తులసి ఇంటికి సామ్రాట్ ఇంటి నుంచి చెక్కు రావడంతో అందరూ ఆశ్చర్యపోయి సామ్రాట్ గురించి నెగటివ్ గా మాట్లాడుతూ ఉంటారు.
కానీ తులసి మాత్రం సామ్రాట్ కి సపోర్ట్ గా మాట్లాడుతుంది. అప్పుడు ఇంట్లో అందరూ ఆ డబ్బులు తీసుకుంటావా అని తులసిని ప్రశ్నిస్తారు. ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి సామ్రాట్ ఇంటికి వెళ్లి హనీ నీ ప్రేమతో మాట్లాడిస్తూ ముద్దాడుతూ ఉంటుంది. అప్పుడు తాను ఇచ్చిన చెక్కు వల్లే తులసి అలా ఉంది అని అనుకుంటాడు.
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు దిగొచ్చాయి. మొన్నటివరకూ పెరుగుతూ వచ్చిన బంగారం…
Ketu Transit 2025 : ఈ 2025 సంవత్సరం కేతు సంచారం అనేక రాశుల జీవితాలను మార్చబోతోంది. ఈ సంవత్సరం…
Kotak Mahindra Bank : కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
Lakhpati Didi Scheme : మహిళలకు అదిరే న్యూస్.. మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.…
Tea Side Effects : అదేపనిగా టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.…
RBI 50 Note : కొత్త రూ. 50 కరెన్సీ నోటు వస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
This website uses cookies.