Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. చీర కట్టుకొని వస్తానని చెప్పి జ్వాలా లోపలికి వెళుతుంది. ఇంతలో జ్వాలా చీర కట్టుకొని బయటకు వస్తుంది.
జ్వాలాని చీరలో చూసిన ఇంద్రమ్మ దంపతులు మేము చూస్తున్నది మా జ్వాలానేనా, చీరలో ఎంత ముద్దుగా ఉన్నావు అంటూ జ్వాలా ని పొగుడుతూ ఉంటారు. జ్వాలా కి తెలియకుండా ఇంద్రమ్మ దంపతులు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఇక పెళ్ళిచూపుల గురించి జ్వాలతో చెప్పడానికి ఇద్దరూ తెగ టెన్షన్ పడుతూ ఉంటారు.
ఇక పెళ్లి చూపుల విషయం జ్వాలా కి చెప్పేలోపే జ్వాలా అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరొకవైపు నిరూపమ్, హిమ బస్తీలో ఉచితంగా వైద్య సేవలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక అక్కడికి వచ్చిన వారిని బస్తీలో వారణాసి, అరుణ వాళ్లు మీకు ఏమైనా తెలుసా అని అడుగుతూ ఉంటుంది. అయితే ఎవరు తెలియదు అని చెప్పడంతో కొంచెం నిరాశగా ఉంటుంది హిమ.
ఇంతలోనే అక్కడికి సత్య, ప్రేమ్ లు వస్తారు. ఇక వారిని చూసిన నిరూపమ్, హిమ ఆనంద పడతారు. కానీ ప్రేమ్ మాత్రం కళ్ళు ఆర్పకుండా హిమని చూస్తూ ఉంటాడు. ఏంటి బావ ఇలా వచ్చావు నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అని హిమ అనడంతో, అప్పుడు ప్రేమ్ నా మనసు ఇక్కడికి వచ్చేలా చేసింది అని అనడంతో హిమ నవ్వుతుంది.
మరొకవైపు స్వప్న ఇంటికి ఆనందరావు వెళ్తాడు.అప్పుడు స్వప్న గుమ్మం దగ్గరే నిలబెట్టి నువ్వు ఒక్కడివే వచ్చావా లేక మీతోపాటు ఎవరైనా వచ్చారా డాడీ అని అడిగి ఆ తర్వాత ఇంట్లో కి రమ్మని పిలుస్తుంది. ఇంట్లోకి వచ్చిన ఆనంద్ రావు ఇల్లు విశాలంగా ఉంది కానీ ఇందులో మనుషులు లేరు కదా అని అనడంతో అప్పుడు స్వప్న మీ ఆవిడ తరుపున రాయబారాలు మోసుకొచ్చావా అని అంటుంది.
అలా వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు మెడికల్ క్యాంపులో హిమ ఫొటోలు తీస్తూ ఉంటారు ప్రేమ్. ఇంతలో జ్వాలా అక్కడికి వస్తుంది. జ్వాలానీ చీరలో చూసిన ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలా వారిద్దరూ కాసేపు ఫన్నీగా పొట్లాడుకుంటారు. ఆ తరువాత జ్వాలాని చీరలో చూసి నిరూపమ్ నువ్వు చీరలో చాలా అందంగా ఉన్నావు అంటూ జ్వాలా అని తెగ పొగిడేస్తాడు.
జ్వాలా కింద పడిపోతుండగా అప్పుడు నిరూపమ్ పట్టుకుంటాడు. నిరూపమ్ మాటలకు జ్వాలా కూడా ఫ్లాట్ అవుతుంది. ఆ తరువాత సౌర్య చేతి ఫై పచ్చబొట్టుని చూసి హిమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు నిరూపమ్ ఎవరి పేరు అది అని అడగగా నా శత్రువు పేరు అని అంటుంది సౌర్య. దీనితో హిమ ఎమోషనల్ గా అక్కడి నుంచి వెళ్లి పోతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు దిగొచ్చాయి. మొన్నటివరకూ పెరుగుతూ వచ్చిన బంగారం…
Ketu Transit 2025 : ఈ 2025 సంవత్సరం కేతు సంచారం అనేక రాశుల జీవితాలను మార్చబోతోంది. ఈ సంవత్సరం…
Kotak Mahindra Bank : కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
Lakhpati Didi Scheme : మహిళలకు అదిరే న్యూస్.. మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.…
Tea Side Effects : అదేపనిగా టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.…
RBI 50 Note : కొత్త రూ. 50 కరెన్సీ నోటు వస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
This website uses cookies.