Nuvvu Nenu Prema July 15 Today Episode _ Vikramaditya Angry on Arya about Padmavathi in Nuvvu Nenu Prema Today Serial in Starmaa Channel
Nuvvu Nenu Prema July 15 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వికీ తమ్ముడు ఆర్య.. పద్మావతికి వికీ ఎలాంటి వాడో చెబుతాడు. వికీలో మీరు ఒకవైపు మాత్రమే చూశారు. అతనిలో మీరు మరో షేడ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారని అంటాడు. ఆరోజు త్వరగా రావాలనే కోరుకుంటున్నానని చెబుతాడు. మీ నిర్ణయం మార్చుకుంటే నాకు కాల్ చేయండని చెప్పి ఆర్య వెళ్లిపోతాడు.
Nuvvu Nenu Prema July 15 Today Episode
ఆ తర్వాత పద్మావతి అత్త వచ్చి.. ఈ అబ్బీ చెబుతుంది వింటుంటే.. నువ్వు అన్నట్టుగా టెంపరోడు మంచివాడనే అనిపిస్తోంది అమ్మీ అని అంటుంది. మరోవైపు.. ఆర్య వికీ మనసులో పద్మావతిపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలనుకుంటాడు. అసలు అన్నయ్య ఈ పద్మావతి గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని భావిస్తాడు. స్ట్రైట్‌గా అడిగితే చెప్తాడు రివర్స్లో అడగాలని అనుకుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మురళి ఆర్యను చూసి ఫైర్ అవుతాడు. ఏంటి.. రోజు రోజుకి ఆ ఇంటికి ఇంటికి రాకపోకలు ఎక్కువవుతున్నాయని, నా గతం గురించి బయటపడేలోగా పద్మావతికి నా లవ్ గురించి చెప్పి వెంటనే తిరుపతికి తీసుకెళ్లిపోవాలనుకుంటాడు. లేదంటే అందమైన జీవితం కలగానే మిగిలిపోతుందని మురళి తెగ టెన్షన్ అయిపోతాడు.
ఇంటకివెళ్లినా ఆర్య.. పద్మావతి మనసులో వికీపై ఉన్న బ్యాడ్ ఓపెనియన్‌ను తగ్గించడానికి ట్రై చేశానని అనుకుంటాడు. ఇప్పుడు వికీ మనసులో పద్మావతిపై ఏ ఓపెనియన్ ఉందో తెలుసుకొని దాన్ని కూడా సాల్వ్ చేస్తే అనుతో తన రూట్ క్లియర్ అవుతుందని భావిస్తాడు. వెంటనే వికీ దగ్గరికి వెళ్లగా అతడు బాక్సింగ్ చేస్తుంటాడు. వెంటనే ఆర్య.. ఏంటిరా.. అంత కోపంగా కొడుతున్నావ్.. మళ్లీ పద్మావతి గానీ గుర్తొచ్చిందా ఏంటి? అని అడుగుతాడు.
Nuvvu Nenu Prema July 15 Today Episode
ఆ పేరు చెప్పగానే ఆగిపోయావే ఏంట్రా.. ఏం తాను అంటే నీకు అంత భయమా అని అంటాడు. దాంతో ఈ విక్రమాదిత్యకు భయం ఏంటో తెలియదని నీకు తెలియదా అని అంటాడు వికీ.. దాంతో ఆర్యా.. తెలుసునుకో.. మరి పద్మావతి అంటే భయం లేనప్పుడు.. తనపై నీకుంది జాలా లేకా.. అని మాటను సాగదీస్తాడు. తన గురించే నువ్వు ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకుంటే నాకు బాధగా ఉందని చెబుతాడు. అసలు పద్మావతి ఎవరు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయని, అయితే అలాంటిది వీఏ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్‌కు ఎక్కడో తిరుపతిలో తగిలి ఇప్పటికీ వదలకుండా వైజాగ్ దాకా వచ్చి టార్చర్ పెడుతుంది.. దిస్ ఇస్ టూ మచ్ అని ఆర్య అంటాడు. తనకు పెద్ద చదువు, అర్హత లేకపోయినా పాత గొడవలు మర్చిపోయి.. పోనీలే పాపమని నువ్వు దయతలచి మన కంపెనీలో జాబ్ ఇప్పిస్తే.. కృతజ్ఞత చూపించాల్సింది పోయి నీకే చుక్కలు చూపిస్తుందా?.. అని ఆర్య అంటాడు.
నీ ప్రాణాలు పణంగా పెట్టి తనను రిస్క్ చేసి కాపాడావు కదా.. అదేనా తనకు గుర్తుండాలి.. లేదే.. పైగా ఇంటికి వచ్చి నిన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి మరి వెళ్ళిపోయిందని అని వికీని ఉడికించే ప్రయత్నం చేస్తాడు ఆర్య.. అంతేకాదు. పద్మావతి అన్న మాటలను విన్న నాకే రక్తం మరిగిపోతుంది. ఇక ఫేస్ చేసిన నీకు ఎలా ఉంటుందో నేను ఊహించుకోగలను అని చెబుతాడు. నీ మంచితనాన్ని అలుసుగా తీసుకున్న పద్మావతికి బుద్ధిచెప్పాల్సిందేనని గట్టిగా చెబుతాడు. ఇప్పుడే వెళ్లి అగ్రిమెంట్ ప్రకారం.. మనకు రావాల్సిన లక్ష అడిగి కడిగిపారేస్తా.. ఎంతైనా ఈ డబ్బు లేని వాళ్ల బుద్ధే అంతరా.. వాళ్ల అవసరాల కోసం మనవాళ్లలాంటి వాళ్ల కాళ్లు పట్టుకుంటారు. అవసరం తీరాక జుట్టు పట్టుకుంటారు.. ఈ విషయంలో పద్మావతి ఒక మెట్టు పైనే ఉంటుందని ఆర్య ఆగకుండా పద్మావతిపై మండిపడుతుంటాడు.
Nuvvu Nenu Prema July 15 Today Episode
అంతే.. వెంటనే వికీ.. ఆపు ఆర్య అంటూ గట్టిగా అరుస్తాడు. ఒకరి గురించి మాట్లాడే ముందు వాళ్ల క్యారెక్టర్ గురించి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని చెబుతాడు. పద్మావతి డబ్బు కంటే తన ఆత్మాభిమానానికి మాత్రమే విలువ ఇస్తుందని, దాన్ని చంపుకుని తాను ఏ పని చేయదని అంటాడు వికీ.. ఇంకెప్పుడు ఇలా తనగురించి మాట్లాడకు అని చెప్పి వికీ వెళ్లిపోతాడు. అంటే.. పద్మావతిపై వికీ మనసులో మంచి అభిప్రాయామే ఉందనమాట.. అని మనసులో నవ్వుకుంటాడు ఆర్య.. ఏది అయితేనేం.. తనకు ఇక లైన్ క్లియర్ అయినట్టేనని ఆర్య సంతోషపడిపోతాడు. ఆ తర్వాత వికీ, పద్మావతి ఆలోచనలో పడతారు. ఆర్య చెప్పిన మాటలను ఇద్దరూ గుర్తు చేసుకుంటారు. వికీ చేసిన మంచి పనులను గుర్తు చసుకుంటూ పద్మావతి.. ఆర్య చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందని అనిపిస్తుంది.. సాటి మనిషికి సహాయం చేసే గుణం కూడా ఉంది ఆ టెంపరోడిలో అని అనుకుంటుంది పద్మావతి. ఆ తర్వాత నిద్రలోనే తన ఇంటికి వికీ వచ్చినట్టుగా కల కంటుంది.
Nuvvu Nenu Prema July 15 Today Episode
సడన్ గా నిద్రలేచి గట్టిగా అరుస్తుంది పద్మావతి. పక్కనే ఉన్న అను ధైర్యం చెబుతుంది. నిద్రలోనూ వికీ గురించే ఆలోచిస్తున్నావా అంటూ.. మీ ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్టు ఉందేమో అంటుంది అను.. ఆ మాటలకు అదేం లేదన్నట్టు అంటుంది పద్మావతి.. ఇంతలో ఫోన్ మోగుతుంది. పద్మావతి తల్లి వత్రం చేయాలంటూ చెబుతుంది. వత్రం ద్వారా అందరి కష్టాలు తీరుతాయని చెబుతుంది. ఆ తర్వాత విక్రమాధిత్య అక్క అరవింద ఫోన్ కాల్ చేస్తుంది.. అను వెంటనే మీరు ఎందుకు చేశారంటూ అని అడుగుతుంది.
తమ ఇంట్లో వత్రం చేస్తున్నామని, పద్మావతి తప్పకుండా రావాలని అడుగుతుంది. తన చెల్లెలు ఉద్యోగానికి రాజీనామా చేసిందని, దయచేసి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టొద్దని అంటుంది. ఇంతలో మురళి పద్మావతి ఇంటికి వచ్చి.. పిన్నీ అంటూ పిలుస్తాడు. అతడి వాయిస్ విన్న అరవింద.. ఎక్కడో ఈ గొంతు విన్నట్టుగా ఉంది అన్నట్టుగా ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత ఇద్దరూ గుడిలో వత్రం జరిగే సమయంలో కలుసుకుంటారు. పద్మావతి కిందపడిపోకుండా వికీ పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగం చూడాల్సిందే..
Read Also : Nuvvu nenu prema : స్టార్ మా కొత్త సీరియల్.. “నువ్వు నేను ప్రేమ” అంట!
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు దిగొచ్చాయి. మొన్నటివరకూ పెరుగుతూ వచ్చిన బంగారం…
Ketu Transit 2025 : ఈ 2025 సంవత్సరం కేతు సంచారం అనేక రాశుల జీవితాలను మార్చబోతోంది. ఈ సంవత్సరం…
Kotak Mahindra Bank : కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
Lakhpati Didi Scheme : మహిళలకు అదిరే న్యూస్.. మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.…
Tea Side Effects : అదేపనిగా టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.…
RBI 50 Note : కొత్త రూ. 50 కరెన్సీ నోటు వస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
This website uses cookies.