Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హిమ, జ్వాలా, నిరుపమ్ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్ అమెరికా కు వెళ్తాను అని చెప్పగా అప్పుడు హిమ, బావ అమెరికాకు వెళ్లి పోతే సౌర్య పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే హిమ కళ్లు తిరిగి పడిపోవడం తో జ్వాల,నిరుపమ్ ఇద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు. మరొకవైపు సౌందర్య,ఆనందరావు లు హిమ కోసం ఎదురుచూస్తూ ఉంటారు.
అయితే అప్పుడు హిమ అక్కడికి రాగానే సౌందర్య రావమ్మా మహాలక్ష్మీ అంటూ హిమను వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు సౌందర్య, స్వప్న శోభల విషయం గురించి మాట్లాడుతూ హిమ తిడుతూ ఉంటుంది. ఇప్పుడైనా కనీసం నోరు తెరిచి మాట్లాడు నీ మనసులో ఏముందో చెప్పు హిమ అనే ఇద్దరు బాధ పడుతూ ఉండగా, అప్పుడు ఆనంద్ రావు నీకు దండం పెడతాను నిరుపమ్ ని ఎందుకు వద్దంటున్నావు చెప్పమ్మా అని బతిమిలాడుతాడు.
అప్పుడు హిమ ఈ ప్రశ్నలన్నింటికీ ఇందులో సమాధానాలు ఉన్నాయి అని చెప్పి సౌందర్య ఆనందరావు లకు క్యాన్సర్ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళింది. అవి చదివిన సౌందర్య ఆనందరావు ఒక్కసారిగా షాక్ అవుతారు. సీన్ కట్ చేస్తే హిమ రిపోర్ట్ చూసిన నిరుపమ్ కూడా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు నీకేం కాదు అంటూ కోపంతో ఆ రిపోర్ట్స్ ని చింపేస్తాడు.
అప్పుడు హిమ ఈ విషయాన్ని వాళ్లకు చెప్పొద్దు అని ప్రామిస్ చేయించుకుంటుంది. అలాగే మన ప్రేమ విషయం కూడా చెప్పద్దు అని అనగా అది ఇప్పుడు అవసరమా అని కోప్పడతాడు నిరుపమ్. అప్పుడు హిమ నన్ను మర్చిపో బావ అనగా ఏం మాట్లాడుతున్నావు హిమ అని నిరుపమ్ ఏడుస్తూ అనగా నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకో బావా నా ఆత్మ శాంతిస్తుంది అంటుంది హిమ.
ఆ మాటలకు నిరుపమ్,హిమ పై విరుచుకు పడతాడు. మరొకవైపు సత్య,ప్రేమ్ లు హిమ పరిస్థితి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఇక జ్వాలా ఆటో లో కూర్చొని నిరుపమ్ నిరుపమ్ ఫోటోలు చూసి మురిసిపోతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో శోభ జ్వాలా దగ్గరికి వచ్చి హెచ్ అంటే ఎవరు అని అడగగా నా శత్రువు అని చెబుతుంది.
మరొకవైపు నిరుపమ్ ఈరోజు నుంచి హిమను భర్తగా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు దిగొచ్చాయి. మొన్నటివరకూ పెరుగుతూ వచ్చిన బంగారం…
Ketu Transit 2025 : ఈ 2025 సంవత్సరం కేతు సంచారం అనేక రాశుల జీవితాలను మార్చబోతోంది. ఈ సంవత్సరం…
Kotak Mahindra Bank : కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
Lakhpati Didi Scheme : మహిళలకు అదిరే న్యూస్.. మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.…
Tea Side Effects : అదేపనిగా టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.…
RBI 50 Note : కొత్త రూ. 50 కరెన్సీ నోటు వస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
This website uses cookies.