Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇది ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
సౌర్య, నిరూపమ్ అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అదేవిధంగా హిమ ను ప్రతిసారి ఏదో పాత పరిచయంలా అనిపిస్తూ ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరొక వైపు హిమ జ్వాలానే సౌర్య అని అనిపిస్తుంది అంటుంది. ఇక నిరూపమ్, హిమ హాస్పిటల్ లో మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి సౌర్య వస్తుంది.
ఏంటి తింగరి ఏం చేస్తున్నావ్ అని అనడంతో నిరూపమ్ చిరునవ్వులు చిందిస్తాడు. అప్పుడు నిరూపమ్ ఏంటి రౌడీ సంగతులు అని అనడంతో సౌర్య ఆశ్చర్యపోతుంది. అప్పుడు సౌర్య మాట్లాడుతూ ఇదిగో తింగరి నువ్వు ఒక డాక్టర్వి చాలా ధైర్యంగా ఉండాలి ఇలా ఉండకూడదు అని ధైర్యం చెబుతుంది.
ఆ తర్వాత జ్వాల నిరూపమ్ కి ఇచ్చిన మాట కోసం హిమ అక్కడినుంచి తీసుకెళ్తుంది. మరొకవైపు ప్రేమ్ కి స్వప్న ఫోన్ చేసి ఎలా ఉన్నావ్ అని అడగగా, డాడీ ఎలా ఉన్నాడు అని అడగవా మమ్మీ అని అంటాడు. అప్పుడు స్వప్న కోపంతో ఒకసారి ఇంటికి వస్తే మాట్లాడాలి అని అంటుంది. మరొకవైపు హిమ కు జ్వాలా ఆటో నేర్పిస్తూ ఉంటుంది.
ఇప్పుడు నేను ఆటో నేర్చుకోవడం అంత అవసరమా అని హిమ అనడంతో నేను డాక్టర్ సాబ్ కి మాట ఇచ్చాను అని చెబుతుంది జ్వాలా. ఇక హిమ ఆటో నడుపుతూ ఉండగా జ్వాల వెనుక వైపు సీట్లో కూర్చొని ఉంటుంది. జాగ్రత్తగా నడుపు తింగరి, కానీ నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను అన్న డైలాగ్ ను మాత్రం చెప్పకు అని అంటుంది.
అప్పుడు హిమ తన గతాన్ని గుర్తు తెచ్చుకొని అక్కడికక్కడే ఆటోని ఆపి వేసి బోరున ఏడుస్తుంది. దీంతో జ్వాలకు ఏమీ అర్థం కాక పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ హిమ కు నీళ్ళు తాగిస్తుంది. ఆ హోటల్ అతను జ్వాలా నీ పేరు పెట్టి పిలవడం తో అదేంటి అని హిమ అడగడంతో అప్పుడు జ్వాలా నాకు అక్క చెల్లెలు అనే పిలుపు నచ్చవు అని చెబుతుంది.
మరొకవైపు సౌందర్య సౌర్య ఫోటో ని పట్టుకొని రోడ్ల వైపు తిరుగుతూ ఉంటుంది. ఏంటి రౌడీ ఈ నానమ్మ ని నీకు చూడాలని అనిపించడం లేదా అంటూ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు ఆటోలో హిమ కళ్లు తిరిగి పడిపోవడం తో సౌర్య టెన్షన్ పడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..