September 21, 2024

Guppedantha Manasu: వసుధార విషయంలో కొత్త ప్లాన్ వేసిన దేవయాని.. వసుధార వాళ్ళ ఊరికి వెళ్ళిన రిషి?

1 min read
devayani new plan about vasudhara in todays guppedantha manasu serial episode

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు, రిషి ఇద్దరు ఆనందంగా ఉంటారు.

ఈ రోజు ఎపిసోడ్ లో వసు, రిషి ఇద్దరు కార్లో వెళ్తుండగా రిషి నీళ్లు తాగడం కోసం కారు ఆపుతాడు. అప్పుడు వసు నా దగ్గర కూడా నీళ్లు అయిపోయాయి అనడంతో సరే ముందుకు వెళ్లి కారు ఆపుతాను అంటాడు రిషి. అప్పుడు వసుధార రిషి వైపు అలాగే చూస్తుండగా రిషి కూడా వసుధార వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత వసుధార,రిషి ఇద్దరు కలిసి ఒక చోట ఆగుతారు. అప్పుడు వసుధార నేను కూడా అక్కడికి వస్తాను సార్ అనడంతో సరే రా అని అంటాడు. రాగానే సరిపోదు సార్ అక్కడ నేను ఏదీ అడిగితే అది కొనివ్వాలి అని అంటుంది.

devayani new plan about vasudhara in todays guppedantha manasu serial episode

అప్పుడు రిషి తన జేబులో ఉన్న పర్స్ ని చూపించి ఈ డబ్బులు మొత్తం నీకే ఇవి సరిపోకపోతే చెప్పు ఇంకా కార్డ్స్ ఉన్నాయి అని అంటాడు. ఆ తర్వాత వసుధార రిషి ఇద్దరు కలిసి షాప్ దగ్గరికి వెళ్లగా అక్కడ వసుధార గోలి సోడాలు ఉండడం చూసి గోలి సోడాలు సార్ అంటే నాకు వద్దు నువ్వే తాగు అని అంటాడు. అదేంటి సార్ అలా అంటారు గోలి సోడా కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో ఇలా దొరకడం చాలా అదృష్టం సార్ అని అంటుంది. అప్పుడు రిషి వసుధార ఇద్దరు కలిసి గోలి సోడా తాగుతారు. అప్పుడు బాగుండడంతో రిషి మళ్ళీ ఇంకా రెండు ఇవ్వండి అని అంటాడు.

ఇంతలో వసుధానికి అక్కడ అరటి పండ్లు కమలా పండ్లు, తీగలు కనిపించడంతో వాటిని చూసి సంతోష పడుతూ బయ్యా ఇవన్నీ ప్యాక్ చేయండి సార్ డబ్బులు ఇస్తాడు అని చెప్పి తీసుకుంటుంది. అప్పుడు కార్ దగ్గరికి వెళ్ళగానే రిషి నిన్ను కారులోనే ఉండమని చెప్పి ఉంటే బాగుండేది వసుధార అని అంటాడు. అప్పుడు సార్ తీగలు తింటారా అనగా అమ్మ తల్లి నాకేం వద్దు అని అంటాడు. నాతో ఎన్నో తినిపించావు ఇక నాకు వద్దులే అని చెప్పి కారు ఎక్కు అని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కారులో వెళ్తూ ఉండగా ఇంతలో వసుధార వాళ్ళ ఊరు బోర్డు రావడంతో వెంటనే కారు దిగి వసుధార,రిషి అక్కడ సెల్ఫీ దిగుతారు.

అప్పుడు వసుధార గట్టిగట్టిగా అరుస్తూ మా రిషి సార్ తో కలిసి మా ఊరికి వచ్చాను అని ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార చూసి రిషి కూడా సంతోష పడుతూ ఉంటాడు. మరొకవైపు దేవయాని అదేంటి నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. ఆ వసుధార కావాలనే ఇలా చేస్తుందా అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే ధరణి అక్కడికి కాఫీ తీసుకొని వస్తుంది. థాంక్స్ ధరణి ఇన్ని రోజులు కైనా సరైన సయానికి తీసుకొని వచ్చావు అని తాగుతుండగా ఛీ ఛీ అని అంటుంది. అదేంటి అత్తయ్య ఏమయింది అని అనడంతో నాకు టీ తాగాలనిపించింది నువ్వు కాఫీ తీసుకొని వచ్చావు అని అంటుంది.

అన్నిసార్లు మనం అనుకున్నవే కరెక్ట్ గా జరగవు కదా అత్తయ్య అనడంతో దేని గురించి మాట్లాడుతున్నావు ధరణి అని అంటుంది. అప్పుడు దాన్ని ఏం లేదు అత్తయ్య టీ గురించి మాట్లాడుతున్నాను అంటూ వెటకారంగా మాట్లాడడంతో వెంటనే దేవయాని ధరణి పై సీరియస్ అవుతుంది. ఆ తరువాత దేవయాని ఏదో ఒక ప్లాన్ చేసి ఈ వసుధార పని చూడాలి దేవయాని అంటే ఏంటో నిరూపించుకోవాలి అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు వసుధార,రిషి కార్లు వెళ్తుండగా అప్పుడు వసుధర అరటిపండు తింటారా సార్ అనడంతో ఇక రెండు రోజులు పాటు నన్నేమీ అడగద్దు వసుధార అని అంటాడు.

అప్పుడు ఆ అరటిపండు తో ఏమేమి చేస్తారో లిస్ట్ మొత్తం రిషి చెప్పగా వెంటనే వసుధార, అలా కాదు సార్ అని దాని గురించి వివరిస్తుండడంతో ఇక చాలు ఆపు వసుధార అని అంటాడు. అప్పుడు వసుధార ఆ అరటిపండు తింటూ ఆహా ఎంత బాగుందో అనడంతో నువ్వు ఎప్పుడు బాగోలేదు అన్నావు అని వెటకారంగా మాట్లాడుతాడు. ఆ తర్వాత వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఇంతలోనే వసుధార చదువుకున్న కాలేజీ రావడంతో కారు ఆపమని చెబుతుంది. అప్పుడు వెంటనే రిషి కొంపదీసి ఈ కాలేజీలో నువ్వు నాటిన చెట్టు ఉందా అని వెటకారంగా మాట్లాడతాడు.

అది కాదు సార్ వేరే చెట్లు నాటాను అనడంతో అవి తినిపిస్తావా నా చేత అనగా లేదులేండి సార్ వెళ్దాం పదండి అని అంటుంది. ఇప్పుడు వసుధార లోపలికి వెళ్లి తన జ్ఞాపకాలు అన్ని రిషితో చెబుతూ ఉంటుంది. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం జగతి మేడం సార్ అని జగతిని పొగుడుతూ ఉంటుంది వసుధార. సార్ జగతి మేడం విషయంలో మీ నిర్ణయం మారదా అనడంతో కొన్ని ఎప్పటికీ మారవు వసుధార అని అంటాడు.

జగతి మేడం అంటే నాకు కృతజ్ఞత ఉంది ఒకటి డాడ్ విషయంలో రెండవది నీ విషయంలో నీలాంటి మంచి బంధాన్ని కలిపినందుకు నేను ఎప్పటికీ మేడమ్ కి రుణపడి ఉంటాను. మేడం ఒక బంధం వద్దనుకుంది మరొక బంధాన్ని కలిపింది అని అంటాడు రిషి. అప్పుడు జగతి ఇచ్చిన గిఫ్ట్ ని వసుధార ఇస్తాడు రిషి. ఏంటి సార్ ఇది అని అడగడంతో ఏమో నేను కూడా చూడలేదు అని అంటాడు రిషి.