Karthika Deepam: దీపని మోసం చేస్తున్న కార్తీక్.. కార్తీక్ చేతిరాత గుర్తు పట్టిన సౌర్య..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప కార్తీక్ ఇంద్రుడికి డబ్బులు ఇస్తుండడం చూసి షాక్ అవుతుంది.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో సౌర్య చదువుకుంటూ ఉండగా ఇంతలో చంద్రమ్మ అక్కడికి వచ్చి స్కూల్ కి వెళ్లి చదువుకోవచ్చు కదా బంగారం అనడంతో లేదు పిన్ని నేను స్కూల్ కి వెళ్తే అమ్మానాన్నలను ఎవరు వెతుకుతారు అందుకే ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటున్నాను అని అనగా వెంటనే చంద్రమ్మ పెద్ద పెద్ద స్కూల్స్ లో చదువుకునే దానివి అని అంటుండగా పదేపదే మీరు వేరు నేను వేరు అనే మాట మాట్లాడకండి పిన్ని అంటుంది. ఇంతలోనే చంద్రుడు అక్కడికి వచ్చి జ్వాలమ్మ వెళ్దాం పద నీకు కొన్ని పరీక్షలు చేయించమని డాక్టర్ అమ్మ చెప్పింది అని అంటాడు.

Advertisement

ఆ పరీక్షలు తర్వాత నాకు పరీక్షలు దగ్గర పడ్డాయి బాబాయ్ మళ్ళీ వస్తాను అనడంతో ఒక గంట మాత్రమే అని అంటాడు. సరే అని ఆ స్లిప్పు చూడడంతో సౌర్య షాక్ అవుతుంది. ఈ స్లిప్పు నిజంగా ఎవరు రాసారో చెప్పు బాబాయ్ అనడంతో ఇంద్రుడు రోజులు టెన్షన్ పడుతూ ఉంటాడు. నిజం చెప్పండి బాబాయి మీరు నా దగ్గర ఏదైనా నిజం చేస్తున్నారు కదా అనగా అదేం లేదు బంగారం అని అంటాడు. మరి ఇందులో సౌర్య బదులుగా రౌడీ అని రాసి ఉంది ఆ పిలుపుతో మా నాన్న మాత్రం నన్ను పిలుస్తారు అని అనగా అప్పుడు ఇంద్రుడు అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు.

Advertisement

మరొకవైపు దీప జరిగిన విషయాలు తెలుసుకుని బాధపడుతూ ఉండగా ఇంతలో పండరి అక్కడికి వచ్చి ఏం జరిగిందమ్మా అని అంటుంది. ఏమి లేదులే పండరి అని అంటూ ఉండగా ఇంతలో చారుశీల కార్తీక్ నవ్వుకుంటూ ఆనందంగా ఇంటికి వస్తారు. అప్పుడు దీప చాలా ఆనందంగా ఉన్నట్లున్నారు డాక్టర్ బాబు అనడంతో అవును దీప అని అంటాడు. అప్పుడు దీప కాస్త అనుమానంగా మాట్లాడడంతో వెంటనే దీప మూడ్ చేయాలి అనుకుంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడు చారుశీల నీకు ఒక విషయం చెప్పేది మర్చిపోయాను నిన్న ఇంద్రుడు కనిపించాడు కానీ పట్టుకునే లోపే పారిపోయాడు అని చెబుతాడు కార్తీక్.

అప్పుడు దీప మనసులో ఇంతబాగా అపద్దాలు ఆడడం ఎప్పుడు నేర్చుకున్నారు డాక్టర్ బాబు అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు దీప చెప్పడం మర్చిపోయాను ఈరోజు మొత్తం నేను హిందువుల కోసం వెతుకుతున్న ఉన్నాను అనడంతో నిన్న మనం వెళ్లిన హోటల్ దగ్గరికి వెళ్లి వెతికారా డాక్టర్ బాబు అనగా అవును దీప అని అంటాడు. అప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళను డాక్టర్ బాబు తీరా అక్కడికి వెళ్లి చూస్తే నా డాక్టర్ బాబు ఆ ఇంద్రుడికి డబ్బులు ఇస్తున్నాడు అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఎందుకు డాక్టర్ బాబు నన్ను ఇంతలా మోసం చేస్తున్నారు నేను మీకు ఏం ద్రోహం చేశాను ఏమి అన్యాయం చేశాను అని నిలదీస్తుంది.

Advertisement

నా డాక్టర్ బాబే నన్ను మోసం చేస్తుంటే నేను ఎవరినీ నమ్మాలి అని ఏడుస్తూ ఉంటుంది దీప. అప్పుడు కార్తీక్ దీప అడిగే ప్రశ్నలకు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో వెంటనే దీప కార్తీక్ చొక్కా పట్టుకొని నిలదీస్తుంది. అప్పుడు చెప్పండి డాక్టర్ బాబు అనడంతో అవును నేనే కావాలని ఇదంతా చేశాను. నీకు ఆ ఇంద్రుడు కనిపించకుండా నేనే ప్రతిసారి నిన్ను మోసం చేస్తూ వచ్చాను అని అంటాడు. ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అనగా నేను ఎక్కువ రోజులు బ్రతకను కాబట్టి అనడంతో చారుశీల తో పాటు దీప పండరీ కూడా షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ బాబు అనడంతో అవును దీప నేను ఎక్కువ రోజులు బ్రతకను అందుకే అమ్మానాన్నల దగ్గరికి నిన్ను తీసుకొని వెళ్లలేదు ఈ విషయం తెలిస్తే వాళ్లు కూడా బాధపడతారు.

నేను లేరు అనుకున్నారు అలాగే ఉంటే బాగుంటుంది అని నేను నిన్ను వారి దగ్గరికి తీసుకెళ్లలేదు అని అంటాడు కార్తీక్. అప్పుడు దీప కుమిలి కుమిలి ఏడుస్తూ చారుశీల డాక్టర్ బాబు ఏదో ఒకటి చేసి బతికించండి ఆయన లేకపోతే బతకలేను అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇలా నువ్వు ఎమోషన్ అవుతావని నేను చెప్పలేదు దీప అని అబద్ధం చెబుతాడు కార్తీక్. అప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక చారుశీల షాక్ అయి అలాగే చూస్తూ ఉంటుంది. మరొకవైపు సౌందర్య జరిగిన విషయాలు తలుచుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి డ్రైవర్ అంజి రావడంతో మనం ఇప్పుడు మళ్ళీ అదే ఊరికి వెళ్లాలి అంజి కారు తీయి అని అంటుంది.

Advertisement

అక్కడ వెతికాం కదా మేడమ్ అనడంతో హాస్పిటల్స్ గుళ్ళు వెతికితే సరిపోతుందా అని అంటుంది సౌందర్య. ఇంతలోనే ఆనందరావు అక్కడికి వచ్చి నా మనవరాలు రెండు మూడు నెలలుగా నా మనువరాలు అక్కడే వెతుకుతోంది దానికి కనిపించలేదు కానీ మీ మేడమ్ కి కమిపిస్తారా అని అంటాడు. అప్పుడు సౌందర్య నేను అక్కడే ఉంటాను ఆ ఊరిలో ఒకమంచి ఇల్లు చూడు అని అంటుంది.

Advertisement