Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఇది ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
వసు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు విషయంలో రిషి ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు జగతి, మహేంద్ర లు కాలేజీ లో జరిగిన విషయం గురించి ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారు అంటూ బాధపడతారు. రిషి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో జగతి మహేంద్ర అని అడగగా నీ కొడుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు నీకు తెలియదా అని అంటాడు మహేంద్ర.
అప్పుడు జగతి నువ్వు ఎలా అయినా కాలేజీకి వెళ్లాల్సిందే అని ఆర్డర్ వేస్తుంది. మరుసటి రోజు ఉదయం కాలేజీలో మినిస్టర్, రిషి కుటుంబ సభ్యులు, స్టూడెంట్స్, మీడియా అందరూ కలిసి మీటింగ్ ను అరెంజ్ చేస్తారు. ఇక అందరూ మీటింగ్ హాల్ లో రిషి కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి రిషి వస్తాడు.
మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చేస్తున్నాను అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కానీ దేవయాని మాత్రం ఎంతో ఆనంద పడుతూ ఉంటుంది. అప్పుడు విషయం మాట్లాడుతూ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఒక పెంకుటిల్లు లాంటిది.
అది కేవలం కొందరికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఆ పెంకుటిల్లు కూల్చివేసి పెద్ద ఏడంతస్తుల మేడ కట్టి అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలి అని ఆలోచించాను. ఈ విషయంపై ఇకపై ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్వహిస్తుంది అని అంటాడు. ఈ విషయం తెలియక మీరు అందరూ కంగారు పడ్డారు అని రిషి అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా సంతోష పడతారు.
కానీ దేవయాని మాత్రం రిషి చెప్పిన మాటకు షాక్ అవుతుంది. కాలేజీ డైరెక్టర్ గా మహేంద్ర భూషణ్ గారు వ్యవహరిస్తారు అని అంటాడు. రెండో డైరెక్టరుగా ఒకరిని ఆలోచించాను అని అనడంతో అక్కడున్నవారంతా ఆలోచనలో పడతారు. అయితే దేవయాని మాత్రం తన పేరు చెబుతాడు అనే లోపల ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటుంది.
కానీ ఒక్కసారిగా జగతి పేరు చెప్పడంతో అక్కడున్నవారంతా సంతోషంతో క్లాప్స్ కొడతారు. కానీ దేవయాని మాత్రం లోలోపల కుమిలిపోతూ రిషి చేసిన పనికి మండి పడుతూ ఉంటుంది. అనంతరం రిషి కి దేవయాని జగతిపై అబద్ధాలు చెప్పి రిషి నీ రెచ్చగొడుతుంది. మరొక వైపు వసు, రిషి ఈరోజు మీరు ఏమీ మాట్లాడకుండా నాతో రావాల్సిందే అంటూ రిషి చేయి పట్టుకుని తీసుకెళ్తుంది వసు.
రిషి, వసు కలిసి హోలీ సెలబ్రేషన్స్ కి వెళ్తారు. అక్కడ ఇద్దరు ఆనందంతో రంగులు పూసుకుంటారు. అలా ఇద్దరూ కాసేపు రొమాంటిక్ గా ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World