Devatha july 25 today Episode : Adithya gets emotional as Devi expresses her hatred for her father in todays devatha serial episode
Devatha july 25 today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆదిత్య, దేవి వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళగా అది చూసి భాగ్యమ్మ చెట్టు చాటున దాక్కుంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో మాధవ,దేవి వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్లి దేవి వాళ్ళని పిలవగా అప్పుడు దేవి చిన్మయిలు ఆదిత్య దగ్గరికి వెళ్లి ప్రేమగా పలకరిస్తారు. అప్పుడు ఆదిత్య ఎలా అయినా రాధ గురించి తెలుసుకోవాలి అని దేవి వాళ్ళను రాధ గురించి అడగగా దేవి బాధపడుతూ సమాధానం చెప్పడంతో వెంటనే చిన్మయి అవును అంకుల్ అమ్మా దేవి ఎందుకో బాధగా ఉన్నారు అని చెబుతుంది.
అప్పుడు ఆదిత్య ఏమయింది దేవి అని అడగగా ఏమీ లేదు సారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దేవి వాళ్ళు గతంలో మీ నాన్న ఎవరు అని ఎవరైనా అడిగితే కలెక్టర్ అని చెప్పు అని చెప్పిన మాటలు తలుచుకొని మళ్ళీ ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. నువ్వు ఆఫీసరు కదా నువ్వు ఏం చెప్పినా అందరూ వింటారు కదా మా నాయనను వెతికి పట్టుకోండి సారు అని అనగా ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ మాటలు విన్న భాగ్యమ్మ కూడా షాక్ అవుతుంది.
ఇప్పుడున్న మాధవ నాయన మా నాయన కాదు సొంతం నాయన వీరే ఉన్నాడు వాడొక దుర్మార్గుడు కసాయుడు మా అమ్మని కష్టాలు పెట్టిండు ఎలా అయినా వెతికి పట్టుకోండి అని అనడంతో దేవి మాటలకు ఆదిత్య కుమిలిపోతూ ఉంటాడు. ఆ మాటలు అన్నీ మాధవ చెప్పాడు అనడంతో ఆదిత్య, భాగ్యమ్మ ఇద్దరూ క్రమంతో రగిలిపోతూ ఉంటారు. ఆ తర్వాత దేవి ఎలా అయినా మా నాయనను పట్టుకోండి సారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు మాధవ జరిగిన విషయాలు అన్ని తలచుకొని సంతోష పడుతూ ఉంటాడు. అప్పుడు భాగ్యమ్మ ఎలా అయినా మాధవ పని తేల్చేయాలి అని కోపంగా రామ్మూర్తి ఇంటికి వెళుతూ ఉండగా అది చూసి రాధను భాగ్యమ్మను పక్కకు లాక్కొని వస్తుంది. అప్పుడు అసలు విషయం చెప్పడంతో రుక్మిణి కుమిలిపోతూ ఉంటుంది.
అప్పుడు ఆదిత్య కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. దీంతో భాగ్యమ్మ, రాధ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేయగా నువ్వేం మాట్లాడకు నువ్వు ఎక్కడికి రాకు నేను నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత రాధ, ఆదిత్య ఇద్దరు ఒక చోట కలుస్తారు. అప్పుడు ఆదిత్య దేవి అన్న మాటలు తలుచుకొని కుమిలిపోతూ ఉంటాడు. ఆదిత్య మాటలు విన్న రాధ కూడా బాధతో కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య కోపంతో ఆ మాధవ గాడి అంతు చూస్తాను అని అనగా వెంటనే రాధ నువ్వు ఇలా కోప్పడతావు అని అందుకే నీకు నిజం చెప్పలేదు పెనిమిటి అని అంటుంది. ఆ తరువాత ఎలా అయినా నా కూతురు దేవీ నేను పిలుచుకొని వెళ్తాను ఆ మాధవ గాడి అంతు చూస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు రాధ ఎంత పిలిచినా కూడా బ్రతిమలాడినా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ తరువాత మాధవ కార్ లో జరిగిన విషయాన్ని తలుచుకొని ఆనందంగా ఉండగా ఇంతలోనే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది.
Read Also : Devatha: దేవికి సన్మానం చేసిన స్కూల్ ప్రిన్సిపల్.. మాధవ పై కోపంతో రగిలిపోతున్న ఆదిత్య..?
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.