Viral video: ట్రైన్ నుంచి బయటకు వంగి మరీ రీల్.. చివరకు ఏమైందంటే?

Youngman getting in to an accident while he doing insta reels in the train
Youngman getting in to an accident while he doing insta reels in the train

Viral video: రోజు రోజుకూ యువత పెడదారి పడుతోంది. సెల్ఫీలు, వీడియోలు, రీల్స్ కోసం ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారు. బైకుపై, బస్సులు, ఆటోలు, రైల్లు, విమానం… ఇలా దేంట్లో వెళ్తున్నా సెల్ఫీలు దిగడం, రీల్స్ చేయడం.. సామాజిక మాధ్యమాల్లో పెట్టడం కామన్ అయిపోయింది. అయితే ఇలా పెడితే వచ్చే ప్రమాదం ఏం లేకపోయినప్పటికీ… ప్రమాదకర స్టంట్లు చేస్తూ చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అందరిలా కాకుండా భిన్నంగా చేయాలనే ఆశతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి ఈ ఘటనే తాజాగా జరిగింది.

Advertisement

ఢిల్లీ వెళ్తున్న మాల్వా ఎక్స్ ప్రెస్ రైళ్లో ఓ యువకుడు ఇన్ స్టా రీల్ కోసం ట్రైన్ కు వేళాడుతూ… ప్రమాదకర ఫీట్ చేసేందుకు సిద్ధపడ్డాడు. మరో వ్యక్తి కిటికీ అవతని నుంచి వీడియో తీస్తుండగా.. ఆ యువకుడు డోరు వద్ద వేలాడుతున్నాడు. అప్పటికే రైలు వేగంగా వెళ్తుండటంతో కాసేపటికే అనుకోని ఘటన జరిగింది. కెమెరాకు ఫోజులిస్తూ పక్కన ఉన్న స్తంభాన్ని గుర్తించలేదు. తీరా చూసే సరికి తలను పక్కకు తీసినా చేయి మాత్రం స్తంభానికి తాకింది. దీంతో అతడు కిందపడిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అయితే విషయం గుర్తించిన ప్రయాణికులు అధికారులకు తెలపగా రైలును ఆపారు. మృతదేహాన్ని ఖన్నా ఆసుపత్రికి తరలించారు. యువకుడికి సంబంధించిన వివరాలు ఏవీ ఇంకా తెలియరాలేదు. అయితే ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.

Advertisement