Wonder Bird : అదో వింతైన పక్షి.. చూడటానికి అచ్చం గుడ్లగూబ మాదిరిగానే ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ పక్షిని కాపాడాడు ఓ రైతు. ఏపీలో ఈ వింతైన పక్షి కనిపించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో సముద్ర తీరంలో కొబ్బరి తోటలో ఈ పక్షి రైతుకు కనిపించింది.
ఈ పక్షిపై కాకులు దాడి చేస్తుండగా.. అక్కడి రైతు వెంటనే దాన్ని రక్షించాడు. అనంతరం ఆ పక్షిని పైకి ఎగిరేయడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ వింతైన అరుదైన పక్షి అటవీ ప్రాంతంలో సంచరించే గుడ్ల గూబ జాతికి చెందినదిగా జంతు శాస్త్రవేత్తలు అంటున్నారు.
రాత్రి సమయాల్లోనే ఈ పక్షులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. చిన్న పక్షులు, పాములను వేటాడి తమ ఆహారంగా తింటుంటాయి. పశ్చిమ తీర ప్రాంతంలో ఇలాంటి వింత పక్షులు కనిపించడం ఇదే మొదటిసారిగా రైతులు చెబుతున్నారు. రైతు చేతులతో పట్టుకున్న ఆ వింత పక్షి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎండాకాలం కావడంతో ఆహారం వెతికే క్రమంలో ఇలా చెట్లపై నుంచి కిందపడి ఉంటుందని రైతులు అంటున్నారు. ఏదిఏమైనా ఆ పక్షి ప్రాణాలను నిలబెట్టిన రైతన్నకు పక్షి ప్రేమికులు ధన్యవాదాలు చెబుతున్నారు.
Read Also : Crime News: మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడిని చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన మహిళలు..!
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
Ginger Benefits : కీళ్లనొప్పులు, దగ్గు, జలుబు, కడుపునొప్పి, మోషన్ సిక్‌నెస్, వికారం, అజీర్ణం వంటి సందర్భాల్లో అల్లంను ఎక్కువగా…
This website uses cookies.